విండీస్ సిరీస్ కు స్మృతి మంధాన

విండీస్ సిరీస్ కు స్మృతి మంధాన

ముంబై: గాయం కారణంగా సౌతాఫ్రికా సిరీస్ కు దూరమైన ఇండియా విమెన్స్ టీమ్ స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన రీ ఎంట్రీ ఇవ్వనుంది. కుడికాలి బొటన వేలి గాయం నుంచి ఆమె పూర్తిగా కోలుకుందని బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. త్వరలోనే వెస్టిండీస్ టూర్ కు  బయలుదేరుతుందని వెల్లడించింది. కరీబియన్ టీమ్ తో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు ఇండియా జట్టు ప్రస్తుతం విండీస్  పర్యటిస్తోంది. ఆదివారం జరిగే రెండో వన్డే వరకు స్మృతి జట్టుతో కలుస్తుందని, మూడో మ్యాచ్ సెలెక్షన్ కు అందుబాటులో ఉంటుందని బోర్డు తెలిపింది.