టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో..మంధాన @ 3

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన వన్డే, టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరుచుకుంది. రెండు ఫార్మాట్లలోనూ మూడో ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుకుంది. మంగళవారం విడుదలైన తాజా జాబితాలో వన్డే బ్యాటర్లలో మూడు స్థానాలు మెరుగైంది. టీ20ల్లో నాలుగు నుంచి మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చింది.  ఆస్ట్రేలియాతో చివరి వన్డేలో సెంచరీ, వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తొలి టీ20లో ఫిఫ్టీతో సత్తా చాటడం ఆమెకు కలిసొచ్చింది. వన్డేల్లో రెండు స్థానాలు దిగజారి 13వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పడిపోయిన కెప్టెన్ హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్ టీ20ల్లో మాత్రం పదో ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిలబెట్టుకుంది. వన్డే ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జెమీమా 21 నుంచి 15వ స్థానానికి చేరుకోగా.. బౌలర్లలో దీప్తి శర్మ మూడు నుంచి ఐదో ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పడిపోయింది. హైదరాబాదీ అరుంధతి రెడ్డి ఏకంగా 48 స్థానాలు మెరుగై 51వ స్థానానికి చేరుకుంది.