ఆ ఇంటిని మర్చిపోలేకపోతున్నా.. స్మృతి ఇరాని ఎమోషనల్ పోస్ట్

ఆ ఇంటిని మర్చిపోలేకపోతున్నా.. స్మృతి ఇరాని ఎమోషనల్ పోస్ట్

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరాని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌‌గా ఉంటారు. మంత్రిగా తాను చేస్తున్న కార్యకలాపాలతోపాటు తన లైఫ్‌‌లోని పలు విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. తాజాగా ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో ఆమె ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఒకప్పుడు అద్దె ఇంట్లో ఉండేవాళ్లం అంటూ పాత ఇంటిని, తన తాతయ్యను గుర్తు చేసుకున్నారు.

‘ఇల్లు.. ప్రతి 11 నెలలకోసారి వేరే చోటుకు మారితే ఎలా ఉంటుందనేది అద్దె ఇంట్లో ఉండే వాళ్లకు తెలుసు. అలా మారినప్పుడు చాలా ఇళ్లల్లో పిల్లలు ఏడుస్తారు. అక్కడి ఫ్రెండ్స్‌‌ను, జ్ఞాపకాలను మర్చిపోలేక, వీడి వెళ్లలేక కన్నీళ్లు పెట్టుకుంటారు. 1246 ఆర్కే పురం, న్యూఢిల్లీలో ఉండే నా ఇల్లు ఇంకా నా గుండెల్లో చెక్కు చెదరకుండా ఉంది. అక్కడే మా తాత తన చివరి శ్వాసను తీసుకున్నారు. నా జీవితాన్ని, నా విధికి ఆయన ఓ రూపం తీసుకొచ్చారు. టెర్రస్ మీద మా నాన్న నేర్పిన పాఠాలు నాకు జీవిత పాఠాలుగా మారాయి’ అంటూ స్మృతి పేర్కొన్నారు.