షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సహకరించండి

ఆమనగల్లు, వెలుగు: ఆమనగల్లు పట్టణంలోని ఎంపీడీవో ఆఫీసు ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సహకారం అందించాలని మాజీ ఎంపీ మల్లు రవికి పట్టణ చిరు వ్యాపారులు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయనను కలిసి రోడ్డు విస్తరణలో తమ డబ్బాలు, షాపులు కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 

తమ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వస్పుల జంగయ్య, ఖలీల్, ఖాదర్, శివలింగం, మల్లేశ్, కుమార్ గౌడ్, చిరు వ్యాపారులు పాల్గొన్నారు.