శ్రీలంకతో మూడో వన్డేలో వెస్టిండీస్‌‌కు ఊరట విజయం

పల్లెకెలె: శ్రీలంకతో మూడో వన్డేలో వెస్టిండీస్‌‌కు ఊరట విజయం లభించింది. టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఎవిన్‌‌ లూయిస్‌‌ (102 నాటౌట్‌‌) సెంచరీతో చెలరేగడంతో.. శనివారం అర్ధరాత్రి ముగిసిన ఈ మ్యాచ్‌‌లో విండీస్‌‌ 8 వికెట్ల తేడా (డక్‌‌వర్త్‌‌ లూయిస్‌‌ పద్ధతి)తో లంకపై నెగ్గింది. దీంతో మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో లంక ఆధిపత్యాన్ని 2–1కి తగ్గించింది. వర్షం వల్ల మ్యాచ్‌‌ను 23 ఓవర్లకు కుదించారు. దీంతో టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన156/3 స్కోరు చేసింది. పాథుమ్‌‌ నిశాంక (56), కుశాల్‌‌ మెండిస్‌‌ (36), అవిష్క ఫెర్నాండో (34) రాణించారు. తర్వాత లక్ష్యాన్ని 23 ఓవర్లలో 195గా నిర్దేశించగా..  కరీబియన్లు 22 ఓవర్లలోనే 196/2 స్కోరు చేసి ఛేదించారు. రూథర్‌‌ఫోర్డ్‌‌ (50 నాటౌట్‌‌) కూడా రాణించాడు.