రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామర్ నటి షకీలా

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామర్ నటి షకీలా

చెన్నై: ప్రముఖ గ్లామర్ నటి షకీలా రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. గురువారం ఆమె కాంగ్రెస్‌ పార్టీ‌లో చేరారు. మలయాళ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన షకీలా.. రాష్ట్ర కాంగ్రెస్ మానవ హక్కుల విభాగం అధ్యక్షుడు మహాత్మా శ్రీనివాసన్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెకు రాష్ట్ర కాంగ్రెస్ మానవ హక్కుల విభాగం ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌‌లో ఆమె చేరిక ఆసక్తికరంగా మారింది. శనివారం నుంచి పార్టీ ప్రచారంలో షకీలా పాల్గొననుందని తెలుస్తోంది.