ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఐదో ఫ్లైట్ ఇండియాకు చేరగా..లేెటెస్ట్ గా ఆరో ఫ్లైట్ చేరుకుంది. ఆరో ఫ్లైట్ లో 240 మంది భారత పౌరులు ఢిల్లీకి చేరారు. బుకారెస్ట్ నుంచి నాలుగు విమానాలు, హంగేరి నుంచి రెండు విమానాలు వచ్చాయని విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి 1,400 మంది భారత పౌరులను స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చామన్నారు. మిగిలిన వారిని సాధ్యమైనంత త్వరగా భారత్ కు రప్పిస్తామన్నారు. తాము సూచనలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 8 వేల మంది ఉక్రెయిన్ ను విడిచి వెళ్లారన్నారు. ఉక్రెయిన్ సరిహద్దుగా ఉన్న 4 దేశాలకు భారత ప్రతినిధులను పంపేందుకు నిర్ణయించామన్నారు. కేంద్రమంత్రులు జోతిరాధిత్య సింధియా రొమేనియాకు, కిరణ్ రిరీజు స్లోవాక్ రిపబ్లిక్ కు, హర్ దీప్ పురి హంగేరికి, పోలాండ్ కు వీకే సింగ్ వెళ్తారన్నారు. ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకునే భారత పౌరులను సేఫ్ గా స్వదేశానికి తీసుకొచ్చే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం వీరికి అప్పగించిందన్నారు.
Delhi| The sixth evacuation flight from Hungary’s capital Budapest carrying 240 Indian nationals who were stranded in Ukraine landed at the Delhi airport
— ANI (@ANI) February 28, 2022
Union Minister Mukhtar Abbas Naqvi welcomed the Indian nationals at the airport. #OperationGanga pic.twitter.com/CCC5GfCPxi
As of now, six flights have arrived carrying around 1400 Indian citizens. Four flights have arrived from Bucharest (Romania) and two flights from Budapest (Hungary): MEA Spokesperson Arindam Bagchi pic.twitter.com/2K7EjEacHF
— ANI (@ANI) February 28, 2022
