కడప జిల్లాలో ఈత సరదా ప్రాణాలను బలితీసుకుంది. ఈత కొట్టేందుకు పెన్నా నదిలో దిగిన ఆరుగురు యువకులు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. సిద్ధవటం దగ్గర ఈ ఘటన జరిగింది. సమాచారం తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. ఇరువురి శివ మృతదేహాన్ని వెలికితీసినట్లు సమాచారం. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
తిరుపతి కోర్లకుంటకు చెందిన శివ, సోము, సతీష్, తరుణ్, రాజేష్ పెన్నానది దగ్గరకు విహారయాత్రకు వచ్చారు. ఈత కొట్టేందుకు నదిలో దిగారు. అయితే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వారు కొట్టుకుని పోయారు.
