పెండ్లికి వెళ్లొస్తుండగా ఢీకొట్టిన లారీ

  • ఆరుగురికి తీవ్ర గాయాలు 

వికారాబాద్: కారులో పెండ్లికి వెళ్లి వస్తుండగా లారీ ఢీని ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. తాండూరుకు చెందిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం కారులో జహీరాబాద్​లోని బంధువుల వివాహానికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా తాండూరు మండలం అంతారం వద్ద ఎదురుగా వచ్చిన లారీ వీరిని ఢీకొట్టింది. 

అనిత అనే మహిళ తీవ్రంగా గాయపడడంతో హైదరాబాద్​కు తరలించారు. శ్రీనివాస్ తోపాటు బాలమణి, అశ్విని, సమీక్ష, షణ్ముఖ ప్రియ అనే నలుగురు గాయపడ్డారు.  పోలీసులు వారిని తాండూరులోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.