జార్ఖండ్​లో రోడ్డు ప్రమాదం ఆరుగురు మృతి

జార్ఖండ్​లో రోడ్డు ప్రమాదం ఆరుగురు మృతి

జంషెడ్​పూర్ :  జార్ఖండ్​లోని జంషెడ్​పూర్​లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 8 మందితో ప్రయాణిస్తున్న కారు డివైడర్​ను బలంగా ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే  ప్రాణాలు కోల్పోగా, ఒకరు ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ పొందుతూ చనిపోయారు. గాయాలైన మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. 

ఐదు సీట్ల కారులో 8 మంది ప్రయాణిస్తున్నారని, బిస్తుపూర్​ వద్ద కారు కంట్రోల్ తప్పి మొదట డివైడర్​ను, ఆపై రోడ్డు పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొట్టిందని జంషెడ్​పూర్ ఎస్పీ కౌశల్ తెలిపారు. కారు నుజ్జునుజ్జు కావడంతో అందులో చిక్కుకున్నవాళ్లను అతికష్టంమీద బయటకు తీశామన్నారు. కారు ఓవర్ స్పీడ్​ కారణంగా యాక్సిడెంట్ జరిగిందన్నారు. వీళ్లంతా సరైకేలా ఖర్స్వాన్ జిల్లాలోని బాబా ఆశ్రమ నివాసితులని, జంషెడ్​పూర్​ వెళ్తున్నారని తెలిపారు. ఆరుగురి మృతిపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సంతాపం వ్యక్తం చేశారు.