అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో ఆరుగురు అరెస్ట్

హైదరాబాద్ జూబ్లీహిల్స్‎లోని నటుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. బన్నీ ఇంటిపై దాడి చేసిన వారిని చేసిన రెడ్డి శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్‎గా గుర్తించిన పోలీసులు.. నిందితులపై 7 సెక్షన్‎ల కింద కేస్ నమోదు చేశారు. బీఎన్ఎస్ 331(5),190,191(2),324(2),292,126(2),131 సెక్షన్‎ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. 

అనంతరం బన్నీ ఇంటిపై ఎటాక్ చేసిన నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. కాగా,  సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ నాయకులు ఆదివారం (డిసెంబర్ 22) అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించిన విషయం తెలిసిందే. 

ALSO READ : సినీ ప్రముఖుల ఇండ్లపై దాడిని ఖండించిన సీఎం

బన్నీ ఇంటి గేట్ ముందు కూర్చొని బాధిత ఫ్యామిలీకి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రేవతి ఫ్యామిలీకి రూ. కోటి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళన సమయంలో కొందరు బన్నీ ఇంటి కంపౌండ్ వాల్ ఎక్కి రాళ్లు రువ్వగా.. మరి కొందరు ఇంట్లోకి వెళ్లి పూల కుండీలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. బన్నీ ఇంటి ముట్టడికి ప్రయత్నించిన వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‎కు తరలించారు.