Ayalaan Trailer: భూమిని కాపాడే ఏలియన్..సంక్రాంతి రేసులో అయలాన్

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ (Shiva Karthikeyan) గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్, ప్రిన్స్, మహావీరుడు సినిమాలు తెలుగులో సూపర్ సక్సెస్ అయ్యాయి.దీంతో ఆయన సినిమాలకు ఇక్కడ కూడా మంచి డిమాండ్ ఏర్పడింది.  

ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా నటిస్తోన్న సైన్స్ ఫిక్ష‌న్ ఫాంట‌సీ మూవీ అయలాన్(Ayalaan). ఇపుడు ఈ సినిమా స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇపుడు ఈ సంక్రాంతి పండ‌క్కి  జనవరి 12న రిలీజ్ కాబోతున్న పాన్ ఇండియా మూవీస్లో అయలాన్ ఒకటి. సైన్స్‌ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ మూవీని ఆర్‌.రవికుమార్(R Ravikumar) తెరకెక్కిస్తున్నారు. 

లేటెస్ట్గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. పెంపుడు జంతువులు, కీటకాల గురించి పట్టించుకునే రైతుగా కనిపించబోతున్నాడు శివ కార్తికేయన్. మనం నివసిస్తోన్న ఈ భూమి అన్ని జీవరాశులకు సొంతం అని నాన్న చెప్పిన మాటలను నేను నమ్ముతాను అంటూ శివ కార్తీకేయన్ చెప్పడంతో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.

ట్రైలర్ ఎంతో ఆసక్తిగా సాగుతూనే..అద్భుతమైన విజువల్స్తో అట్ట్రాక్ట్ చేస్తోంది. ఇక అంతలోనే సడెన్గా..పై నుంచి ఒక ఏలియన్ దిగుతుంది. హీరో శివ కార్తీకేయన్ లైఫ్ లోకి ఏలియన్ వచ్చాక..ఆయన లైఫ్ ఎలా మారింది? అనేది ట్రైలర్లో చూపించారు. మామూలుగా అమెరికాను అంతం చేయడానికే కదా వెళ్తారు..ఇప్పుడు మా దేశానికి వచ్చారేంట్రా అంటూ శివకార్తికేయన్..ఏలియన్ను అడిగే డైలాగ్ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. 

దుష్ట మల్టీ-మిలియనీర్ వ్యాపారవేత్త (శరద్ కేల్కర్ పోషించాడు) విలన్ సృష్టించే విధ్వంసాన్ని..ఏలియన్ తో కలిసి హీరో ఎలా అరికట్టాడు? ఏలియన్ కు తోడుగా నిలిచిన హీరో ఏం చేశాడు? వంటి అంశాలను రేకేత్తించింది ట్రైలర్. కామెడీ, యాక్షన్, సైన్స్ ఫిక్షన్ తో కూడిన ఎంటర్ టైనర్కి ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంటుంది.