రామగిరి గుట్టపై వైభవంగా సీతారాముల కళ్యాణం

కల్వకుర్తి, వెలుగు :  మండల పరిధిలోని రఘుపతి పేట గ్రామంలోని రామగిరి గుట్టపై  సీతారాముల కల్యాణం గురువారం  వైభవంగా నిర్వహించారు.  ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కసి రెడ్డి నారాయణరెడ్డి వచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు,  సీతారాముల కల్యాణం చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  

23న ఆలయం చుట్టూ బండ్లు తిరుగు ను, 24 న రథోత్సవం, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు, 26న బండలాగుడు పోటీలు ఉంటాయని ఆలయ కమిటీ చైర్మన్ భాష మోని భీమయ్య తెలిపారు. అలాగే పట్టణంలోని హరిహర టౌన్షిప్ లో నూతనంగా నిర్మించిన హనుమాన్ దేవాలయంలో ఆంజనేయస్వామిని ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంద్ కుమార్, భూపతి రెడ్డి, హరీశ్​ రెడ్డి  ఉన్నారు