స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి

  • బీజేపీ సభ్యత్వ నమోదు ఉద్యమంలా నిర్వహించాలి 
  • సిర్పూర్​ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ 

మెదక్, వెలుగు: గ్రామ గ్రామాన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాలని, వచ్చే లోక్​ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని సిర్పూర్​ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్​ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక టీఎన్జీవోస్ భవన్ లో మెదక్ జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే హరీశ్ మాట్లాడుతూ  ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.  

గ్రామ, మున్సిపల్​ వార్డులన్నింటిలో పార్టీని బలోపేతం చేయాలన్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మురళి గౌడ్ మాట్లాడుతూ..  ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తున్నదని, ఇందుకు  కారణమైన ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా నిలవాలని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారన్నారు.  జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్  మాట్లాడుతూ.. జిల్లాలో నిర్దేశిత లక్ష్యాన్ని మించి సభ్యత్వాలు చేస్తామన్నారు. సభ్యత్వ నమోదు పోస్టర్​ రిలీజ్​ చేశారు.

కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు పరిణిత,  రఘువీరారెడ్డి, విజయ్​ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎంఎల్​ఎన్​ రెడ్డి, శ్రీనివాస్ , జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి మహేశ్వరి, మోర్చాల జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, కాశీనాథ్​, సీనియర్ నాయకులు రాగి రాములు,  పట్టణ, వివిధ మండలాల అధ్యక్షులు ప్రసాద్, రాజు, రంజిత్ రెడ్డి, ప్రభాకర్, రాములు, చంద్రశేఖర్, భాను పాల్గొన్నారు.