IND vs AUS: సిరాజ్,హెడ్‌ల మధ్య గొడవ.. మాటకు మాట బదులిచ్చిన ఆసీస్ క్రికెటర్

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అడిలైడ్ టెస్టులో ఎట్టకేలకు వికెట్ తీసుకున్నాడు. సెంచరీతో జోరు మీదున్న హెడ్ వికెట్ తీయడంతో సిరాజ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇన్నింగ్స్ 82వ ఓవర్ నాలుగో బంతికి యార్కర్ ఫుల్ టాస్ తో హెడ్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. సిరాజ్ వేసిన ఈ బంతికి హెడ్ వద్ద సమాధానం లేకుండా పోయింది. అయితే హెడ్ ఔట్ అయిన తర్వాత సిరాజ్ సెలెబ్రేషన్ ఓ రేంజ్ లో సాగింది. 

హెడ్ ను చూస్తూ గట్టిగా అరిచాడు. ఇది హెడ్ కు నచ్చలేదు. అతను క్రీజ్ దాటి వెళుతూ సిరాజ్ ను ఏదో తిట్టాడు. ఇద్దరి మధ్య కొన్ని సెకన్ల పాటు చిన్నపాటి గొడవ సాగింది. సిరాజ్ ఆసీస్ క్రికెటర్లతో గొడవ పెట్టుకోవడం ఆ దేశ ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. దీంతో సిరాజ్ ను అడిలైడ్ ఫ్యాన్స్ తిడుతున్నారు. ఈ హైదరాబాదీ పేసర్ గురించి నెగెటివ్ గా ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో హెడ్ 141 బంతుల్లోనే 140 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యాన్ని అందించాడు. 

Also Read :- న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన RCB యువ బ్యాటర్

భారత్ బౌలర్లపై ఆధిపత్యం చూపించిన హెడ్ ఖాతాలో 17 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ విషయానికి వస్తే రెండో రోజు డిన్నర్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 152 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. క్రీజ్ లో స్టార్క్ (18) ఉన్నాడు. హెడ్(140) సెంచరీతో ఆసీస్ కు భారీ ఆధిక్యం సంపాదించగలిగింది.