సింగూర్ ప్రాజెక్ట్ రెండు గేట్లు ఓపెన్

 పుల్కల్/వెలుగు: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి శనివారం14,168 క్యూసెక్కుల వరద నీరు కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిగా నిండుగా ఉండడంతో 6,11వ నంబర్ గేట్లను1.5 మీటర్లు ఎత్తి దిగువకు16,284 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 2,823, క్యూసెక్కుల నీళ్లు విడుదలవుతున్నాయి. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 29.827 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఇరిగేషన్ ఆఫీసర్లు తెలిపారు.