సింగూర్ ప్రాజెక్ట్  రెండు గేట్లు ఓపెన్

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్ట్ కు గురువారం వరద తాకిడి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు14,563 క్యూసెక్కుల వరద నీరు చేరింది. అప్రమత్తమైన ఆఫీసర్లు 6,11నంబర్ గేట్లను 1.5 మీటర్లు ఎత్తి  దిగువకు 8,142 క్యూసెక్కుల నీటిని వదిలారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి 2,803, ఎడమ కెనాల్ ద్వారా సాగుకు100, హైదరాబాద్ మెట్రో వాటర్‌‌ సప్లై కోసం 80, మిషన్ భగీరథ నీటి సరఫరాకు 70, తాలెల్మ లిఫ్ట్ ఇరిగేషన్ కు 31 మొత్తం 19,127 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కాగా సింగూర్ పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 29.827 టీఎంసీల నీరు నిల్వ ఉందని డిప్యూటీ ఈఈ నాగరాజు, ఏఈఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంజీరా పరివాహక ప్రాంతాల ప్రజలు నదిలోకి వెళ్లొద్దని సూచించారు.పుల్కల్, వెలుగు