SinghamAgainReview: సింగం ఎగైన్ రివ్యూ.. రామాయణం రిఫరెన్స్‌తో వచ్చిన బాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్

అజయ్ దేవగన్‌‌‌‌తో సింగం, రణ్‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌తో సింబా, అక్షయ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌తో సూర్యవంశీ లాంటి పోలీస్‌‌‌‌ స్టోరీలను రూపొందించిన రోహిత్ శెట్టి.. ఈసారి తన కాప్ యూనివర్స్‌‌‌‌ (సింగం ఎగైన్) లోకి వీరందనీ తీసుకొచ్చారు.

అజయ్ దేవగన్​ హీరోగా రోహిత్ శెట్టి రూపొందించిన ‘సింగం ఎగైన్‌‌‌‌’ (Singham Again) దీపావళి కానుకగా ఇవాళ శుక్రవారం (నవంబర్ 1న) థియేటర్లలో రిలీజైంది. ఫస్ట్ 5 నిమిషాల ట్రైలర్ తోనే రామాయణాన్ని సోషలైజ్ చేస్తూ ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు రోహిత్ తన మార్క్ చూపించగా.. రిలీజయ్యాక ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసాడో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే:

ఒక విలన్ ఒమర్ హఫీజ్ (జాకీ ష్రాఫ్)ను బాజీరావ్ సింగం (అజయ్ దేవగణ్) అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత బాజీరావ్ నేతృత్వంలో శివ స్క్వాడ్ ఏర్పాటు చేస్తారు హోమ్ మంత్రి (రవికిషన్). ఆ తర్వాత కొన్ని మిషన్స్ కంప్లీట్ అయ్యాక బాజీరావ్ సింగం భార్య అవని (కరీనా కపూర్ ఖాన్)ను ఒమర్ మనవడు, డేంజర్ లంక (అర్జున్ కపూర్) కిడ్నాప్ చేస్తాడు. దానికి ముందు తమిళనాడులోని శక్తి శెట్టి (దీపికా పదుకోన్) విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ స్టేషన్ తగలెట్టేస్తాడు. ఆ తర్వాత అవనీని శ్రీలంక తీసుకు వెళతాడు జుబైర్. ఇక తన భార్యను రక్షించుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో సింగం తన భార్యను ఒంటరిగా రక్షించుకోవడం కష్టం అని తన స్నేహితుల సాయం తీసుకుంటాడు.  సింబ (రణ్‌వీర్ సింగ్), సత్య (టైగర్ ష్రాఫ్), సూర్యవంశీ (అక్షయ్ కుమార్) ఎటువంటి సాయం చేశారు? శత్రువుల చేతిలో బందీగా మారిన తన భార్య కరీనా కపూర్‌ని సింగం ఎలా చేరుకోగలిగాడు? తన స్నేహితులు, ఆత్మీయుల సాయం ఎంతవరకు ఫలించింది? అసలు సింగం భార్య అవని ను ఎందుకు బందించాల్సి వచ్చిందనే విషయాలు తెలియాలంటే సింగం ఎగైన్ మూవీ థియేటర్ లో చూడాల్సిందే.

ఎలా ఉందంటే::

ఫస్ట్ సీన్‌‌‌‌తోనే రామాయణాన్ని సోషలైజ్ చేస్తూ ఈ సినిమా తెరకెక్కించినట్టుగా రివీల్ చేశారు. ఆ తర్వాత సీతగా కరీనా కిడ్నాప్, తనను వెతికే రాముడిగా అజయ్ దేవగణ్ కనిపించగా.. లక్ష్మణుడి తరహా పాత్రలో టైగర్ ష్రాఫ్, హనుమంతుడిని పోలిన పాత్రలో రణ్‌‌‌‌వీర్ సింగ్, గరుత్మంతుడిని పోలిన పాత్రలో అక్షయ్ కుమార్ కనిపించారు.

లేడీ సింగం శక్తి శెట్టిగా దీపిక పదుకొణె,  పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ తమిళ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించింది. రావణుడి లాంటి అర్జున్‌‌‌‌ కపూర్‌‌‌‌‌‌‌‌ పాత్రను చంపి సీతను తీసుకొచ్చేందుకు వీళ్లంతా ఎలా హెల్ప్ చేశారు అనే కథనంతో సినిమా సాగింది. మొత్తానికి ప్రస్తుత ట్రెండ్‌‌‌‌కు తగ్గట్టు రామాయణం, హిందూత్వం, మహారాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌‌‌‌ అంశాలను తన కాప్‌‌‌‌ యూనివర్స్‌‌‌‌లో మిళితం చేశాడు రోహిత్ శెట్టి. అయితే.. కమర్షియల్ పంథా, ఫార్ములా అంటూ రోహిత్ శెట్టి సినిమా సినిమాకూ తన మార్క్ మిస్ అవుతున్నారు.

మైథాలజీ సినిమాలకు ఆదరణ బావుంటోందనే ఉద్దేశ్యంతో రామాయణాన్ని తీసొకొచ్చినా ఆడియన్స్ ను అట్ట్రాక్ట్ చేయలేకపోయాడు. స్టార్ హీరోలతో యాక్షన్ సీక్వెన్స్ బాగున్నప్పటికీ స్లో నేరేషన్ ఉండటం వల్ల కథ-కథనాలలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతోంది. ఏదేమైనా ఒక్క సినిమాలో ఇంతమంది హీరోలను ఒప్పించడంతో డైరెక్టర్ రోహిత్ శెట్టి సక్సెస్ అయ్యాడు. 

సాంకేతిక అంశాలు::

‘సింగం ఎగైన్’ మూవీకి సలార్ ఫేమ్ రవి బస్రూర్, ఎస్. ఎస్. తమన్ సంయుక్తంగా సంగీతం అందించారు. రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. వీరిద్దరి పనితనం బాగుంది. సినిమాకు సంగీతం ప్రధానబలంగా నిలిచింది. గిరీష్ కాంత్-రాజా హుస్సేన్ మెహతా సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి చాలా ప్లస్ అయింది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ బాగుంది.

డైరెక్టర్ రోహిత్ శెట్టి ఐడియా బాగుంది. తాను రాసుకున్న స్టోరీని రామాయణ పర్వాలుగా చెప్పాలనుకుని సక్సెస్క అయ్యాడు. కానీ, దర్శకుడిగా, రచయితగా ఆకట్టుకోలేకపోయాడు. తన పెన్నుకి ఇంకా పని పెట్టుంటే క్రాప్ యూనివర్స్ లో బిగ్గెస్ట్ ఫిల్మ్ గా నిలిచేది.  నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.