నస్పూర్, వెలుగు: సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలను ఎప్పటికప్పుడు ఎంప్లాయ్ పర్సనల్ రికార్డులో పొందుపరచాలని సింగరేణి జనరల్ మేనేజర్(పర్సనల్, సెక్యురిటీ) దీక్షితులు సూచించారు. మంగళవారం శ్రీరాంపూర్సింగరేణి జీఎం ఆఫీస్‌లో బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, ఎస్టీపీపీ ఏరియాల పర్సనల్ డిపార్ట్మెంట్ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగులకు రిటైర్మెంట్తర్వాత అందించాల్సిన అన్ని సదుపాయాలను వీలైనంత త్వరగా వర్తింపజేయాల్సిన బాధ్యత పర్సనల్ విభాగానిదేన్నారు. గైర్హాజరు ఉద్యోగులు, వారి ఫ్యామిలీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తూ డ్యూటీలకు హాజరయ్యేలా ప్రోత్సహించాలని కోరారు.
సెక్యూరిటీ విభాగం కీలకం
సింగరేణి సంస్థ ఆస్తుల పరిరక్షణలో సెక్యూరిటీ విభాగం అధికారులు కీలకంగా వ్యవహరించాలని సింగరేణి పర్సనల్జీఎం దీక్షితులు, శ్రీరాంపూర్ఏరియా ఇన్చార్జి జీఎం టి.శ్రీనివాస్అన్నారు. శ్రీరాంపూర్ఏరియా సీసీసీ సింగరేణి గెస్ట్‌హౌస్‌లో సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల సెక్యూరిటీ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించి మాట్లాడారు. సింగరేణి ఆస్తులు, గనులు, డిపార్ట్మెంట్లు, ఓపెన్‌కాస్ట్ మైన్లలో జరుగుతున్న అక్రమాలు, దొంగతనాలను అరికట్టాలన్నారు.
బొగ్గు రవాణా చేసే క్రమంలో రైల్వే వ్యాగన్లు, టిప్పర్లు, లారీల్లో తనిఖీలు చేపట్టాలన్నారు. అనంతరం ఈ నెలాఖరున పదవీ విరమణ పొందనున్న దీక్షితులుతోపాటు బెల్లంపల్లి ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్వరప్రసాద్ను ఘనంగా సన్మానించారు. ఏరియా ఏస్వోటుజీఎం సత్యనారాయణ, పర్సనల్డీజీఎంలు అజయ్ కుమార్(కార్పొరేట్), అరవిందరావు, వేణు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.