సింధూర్ ఖేలా - ధునుచీ నాచ్ వేడుకలో మహిళల డ్యాన్స్

సింధూర్ ఖేలా - ధునుచీ నాచ్ వేడుకలో మహిళల డ్యాన్స్

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో ‘‘సింధూర్ ఖేలా - ధునుచీ నాచ్’’ వేడుకలు ఘనంగా జరిగాయి. పెళ్లైన మహిళలు కాళీ మాతను పూజించి... ఒకరికొకరు సింధూరం దిద్దుకోవడం ఈ పూజ స్పెషాలిటీ. ఆ తర్వాత కాళీమాతను స్తుతిస్తూ నాట్యం చేస్తారు. కుటుంబాన్ని రక్షించాలని కాళిమాతను వేడుకుంటారు. దక్షిణ కోల్‌కతాలోని నేతాజీ నగర్‌‌లో నిన్న జరిగిన ఈ ‘‘సింధూర్ ఖేలా - ధునుచీ నాచ్’’లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాళీమాతకు ధూపం వేసి.. ఆ తర్వాత జోరుగా నాట్యం చేశారు.