IND vs AUS: బూమ్.. బూమ్.. భయం: ఆస్ట్రేలియా ఆటగాళ్లకు బుమ్రాపై పాఠాలు

బాక్సింగ్‌ డే టెస్టుకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 26 నుంచి భారత్‌- ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్న్‌ వేదికగా బాక్సింగ్‌ డే టెస్టు మొదలు కానుంది. ఐదు మ్యాచ్ ల టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం రెండు జట్లు చెరో మ్యాచ్‌లో నెగ్గగా.. మరో టెస్ట్‌ డ్రాగా ముగిసింది. దాంతో, నాలుగో టెస్ట్ ఇరు జట్లకు చావో.. రేవో లాంటిది. 

ఈ క్రమంలో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఆసీస్ మాజీ క్రికెటర్ సైమన్ కటిచ్.. ఆ జట్టు ఆటగాళ్లకు కీలక సూచనలు చేశారు. మ్యాచ్ లో బుమ్రా ఆధిపత్యాన్ని తగ్గించడం సాధ్యం కాదన్న సైమన్ కటిచ్.. భారత పేసర్ పై ఎదురుదాడికి దిగకపోవటమే మంచిదని ఆ జట్టు బ్యాటర్లకు పాఠాలు బోధించారు.

Also Read :- అశ్విన్ స్థానంలో 26 ఏళ్ల ముంబై ఆల్‌రౌండర్

దూకుడు వద్దు.. అదొక్కటే మార్గం

బుమ్రా బౌలింగ్ లో బౌండరీల కోసం ప్రయత్నించొద్దని కటిచ్.. ఆసీస్ ఆటగాళ్లకు సూచించారు. బదులుగా సింగిల్స్, డబుల్స్‌ తీస్తూ స్కోరుబోర్డును ముందుకు కదిలించడంపై దృష్టి పెట్టాలని అన్నారు. అక్కడే బుమ్రా మానసిక స్తైర్యం దెబ్బతిని లయ తప్పుతాడని చెప్పుకొచ్చాడు. ఒకవేళ పరుగులు చేయడం కష్టమనిపిస్తే.. డిఫెన్సివ్ కు ప్రాధాన్యమివ్వమని నొక్కి చెప్పారు.

బుమ్రాకు భయపడేవాడిని కాదు..

అంతకుముందు చివరి రెండు టెస్టులకు మెక్‌స్వీనే స్థానంలో జట్టులోకి వచ్చిన 19 ఏళ్ల యువ బ్యాటర్ సామ్ కొంటాస్.. బుమ్రాను ఎదుర్కోవడానికి తన వద్ద ప్రత్యేక వ్యూహాలు ఉన్నట్లు వెల్లడించాడు. కానీ, అవేంటనేది బయటకు చెప్పనని మాట దాటేశాడు. బుమ్రాతో ఆసక్తికర సమరం కోసం తాను ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.