సింహగిరిపై మహా యజ్ఞం ..అద్భుతం ..అమోఘం 

సింహాచలం స్వామివారి సుదర్శన నారసింహ మహా యజ్ఞం చివరి రోజు.. ఐదవ రోజు విజయవంతంగా ముగిసిందని  ఈవో ఎస్. శ్రీనివాసు మూర్తి తెలిపారు. చివరి రోజు కనుల విందుగా శ్రీ సుదర్శన  నారసింహ మహా యజ్ఞంజరిగింది.  వేదమంత్రాలతో పులకించిన సింహగిరి కొండ మారు మ్రోగింది.  

భక్త కోటి ఆరాధ్య దైవం, సింహాచలం శ్రీ వరాహోలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో 5 వ రోజు శ్రీ సుదర్శన నారసింహ మహా యజ్ఞం అంగరంగ వైభవంగా.. అద్భుతంగా జరిగింది.  ఆదివారం ( మార్చి 31)   వేలాది మంది భక్తులు యజ్ఞంలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు.  సర్వాభరణాలతో ఉత్సవ మూర్తులు గోవిందరాజు స్వామి.. ..  శ్రీదేవి భూదేవి లను ఒక పల్లకిలో  శోభాయమానంగా అధిష్టింపజేసి ...  శ్రీ సుదర్శన చక్ర పెరుమాళ్ ను ఉత్తర రాజగోపురం ఎదురుగా ఉన్న యజ్ఞశాలకు తిరువీధిగా తీసుకొచ్చారు.    గోపూజ అనంతరం   వేద మంత్రాలతో మృధు మధుర మంగళ వాయిద్యాలు నడుమ శాస్త్రోక్తముగా పూజా కార్యక్రమాలు జరిపించారు. 

ఆలయ స్థానాచార్యులు టి రాజగోపాల్ తన ప్రవచనాలతో భక్తులను విశేషంగా  ఆకట్టుకున్నారు.   ఆలయ పూజారులు..  భక్తులకు గోత్రనామాలతో పూజలు జరిపించి వారికి యజ్ఞ ప్రసాదం, భోజన సదుపాయం కల్పించారు. అధిక సంఖ్యలో భక్తులు  సుదర్శన నరసింహా మహాయజ్ఞంలో పాల్గొన్నారు.   యజ్ఞంలో పాల్గొన్న భక్తులకు   దేవస్థానం అధికారులు శాలువ, రవిక ( జాకెట్​ క్లాత్​)  కళ్యాణము లడ్డు,  అరకిలో పులిహోర ప్రసాదము,  అప్పన్న స్వామి వారి  ప్రతిమ అందజేశసి...  ప్రత్యేకంగా భోజనం సదుపాయాలను కల్పించారు.   భక్తులంతా స్వర్ణ కవచ అలంకరణ లో ఉన్న సింహాద్రినాధుడు ను దర్శించుకుని సేవించుకున్నారు. యజ్ఞం మహా పూర్ణాహుతిలో భక్తులు పాల్గొన్నారు.   ఆలయ ఈవో ఎస్ .శ్రీనివాస్ మూర్తి ఆధ్వర్యంలో  ఆలయ ఉద్యోగులు భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించారు. అర్చక పరివారం, వేద పండితులు అధ్యాపకులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు.