మనదేశం అనేక మతాలు, ఆచారాలకు పుట్టినిల్లు. మతాలు వేరైనా..ఆచారాలు వేరైనా ఒకరినొకరు గౌరవించుకోవడం సాంప్రదాయం. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనలో జరిగిన ఓ ఘటన భారతీయుల ఐకమత్యానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.
దేశ వ్యాప్తంగా కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయం బిల్లుపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరసనలకు ఇతర దేశాలకు చెందిన దేశాదినేతలు, ఎంపీలు సైతం మద్దతు పలుకుతున్నారు. ఈనేపథ్యంలో తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ పంజాబ్ కు చెందిన రైతులు ఢిల్లీ బోర్డర్ లో నిరసనలు తెలుపుతున్నారు. అదే సమయంలో రోడ్డుపై ముస్లీంలు నమాజ్ చేసుకుంటుండగా..అక్కడే ఉన్న సిక్కు రైతులు వారికి మద్దతు పలికారు. నిరసనను మధ్యలోనే నిలిపివేసి సిక్కు రైతులు సోదర భావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
