నాగచైతన్య ఎంగేజ్​మెంట్ ముహూర్తంలో ....8:8:8 & 6 : 6 ఫార్ములా ఏంటో తెలుసా..


 

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. నా కుమారుడు నాగచైతన్య, శోభితా ఈరోజు ( ఆగస్టు 8) ఉదయం 9.42గంటలకు నిశ్చితార్థం జరిగింది.  ఈ విషయాన్ని నాగార్జున ట్వీట్​ చేస్తూ 8.8.8  ఫార్ములా అని రాశారు.  సంఖ్యా శాస్త్రం ప్రకారం ఈ ఫార్ములా అర్దం ఏమిటి.. ఈ ముహూర్తానికి ( సంఖ్యాశాస్త్రం ప్రకారం) ఎంతటి ప్రాధాన్యత ఉందో తెలుసుకుందాం. . . 

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ప్రేయసి, నటి శోభిత ధూళి పాళతో చైతూ నిశ్చితార్థం  జరిగింది. ఈ లవ్ బర్డ్స్ ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నారన్న వార్త నెట్టింట్లో హల్ చల్ చేసిన సంగతి విదితమే. ఈ రూమర్స్ నిజం చేశారు ఈ జంట. చైతూ-శోభిత ఎంగేజ్ మెంట్స్ పిక్స్ షేర్ చేస్తూ అఫీషియల్ ఎనౌన్స్ చేశాడు అక్కినేని నాగార్జున. ఇందులో చైతూ వైట్ షేర్వాణీ ధరించగా.. శోభితా పింక్ శారీలో ముస్తాబయ్యింది. అత్యంత సింపుల్‌గా, కేవలం కుటుంబ సభ్యుల మధ్యే ఈ నిశ్చితార్థ వేడుక జరిగింది. 

‘మా అబ్బాయి నాగ చైతన్య నిశ్చితార్థం, శోభిత ధూళిపాళతో ఈ రోజు (ఆగస్టు 8న) ఉదయం 9:42 గంటలకు జరిగినట్లు ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆమెను మా కుటుంబంలోకి చాలా సంతోషంగా స్వాగతిస్తున్నాం. ఈ ఇద్దరికీ అభినందనలు, వారికి జీవితాంత ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను. 8.8.8 అంటూ ది బిగినింగ్ ఆఫ్ ఇన్ ఫినిటీ లవ్’ అంటూ ట్వీట్ చేశారు.

కాగా, నాగ చైతన్య- శోభిత ఆగస్టు 8న వివాహం చేసుకోవడానికి న్యూమరికల్ అండ్ సైంటిఫిక్ రీజన్ కనిపిస్తుంది. ఆగస్టు అంటే ఎనిమిదో నెల, ఎనిమిదో తారీఖు అలాగే.. 2024ను కూడితే.. 8 వస్తుంది. దీన్నే నాగార్జున 8.8.8. అంటూ ప్రస్తావించారు. అలాగే ఎనిమిదిని తిరగేస్తే.. ఇన్ఫిటినిటీ కిందకు వస్తుంది. అంటే దీనికి అంతం లేదు. సో ఈ ప్రేమకు ఎండింగ్ లేదు, ఎప్పుడు కలిసి ఉంటామని చెప్పేందుకు ఈ తేదీలో నిశ్చితార్థం చేసుకున్నారని తెలుస్తుంది. అలాగే బంధం దృఢత్వం గురించి కూడా ఇది సూచిస్తుంది. ఇవన్నీ కలిసి రావడంతోనే ఈ రోజున ఈ ఇద్దరు ఎంగేజ్ మెంట్ చేసుకున్నారని తెలుస్తుంది..

సంఖ్యా శాస్త్రం ప్రకారం  8 సంఖ్య  చాలా శుభప్రదంగా ఉంటుంది. 8 ముహూర్తంలో ఏ పని తలపెట్టినా ఎలాంటి ఆటంకాలు ఉండవని సంఖ్యా శాస్త్ర నిపుణులు చెబుతునన్నారు.  అందుకే దాదాపుగా పెళ్లి ముహూర్తాలు గాని.. ఎంగేజ్​ మెంట్​ టైంగాని 8 వచ్చేలా ఫిక్స్​ చేసుకుంటారు.  పెళ్లి చేసుకోని వారు..  ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే మీ కోరిక నెరవేరుతుంది.

ఇందులో మరొకటి కూడా ఉంది. ఈరోజు (2024, ఆగస్టు 8) తేదీని పరిశీలిస్తే 8–8–2024 దీనిని మొత్తం కలిపితే 8+8+2+0+2+4= 24 అంటే 2+4= 6 అవుతుంది.  ఇదే సంఖ్య వచ్చేలాగా గణిత జ్యోతిష్యం ప్రకారం 9.42 అంటే 9+4+2= 15 అంటే 1+5=6.. అంటే నాగచైతన్య ఎంగేజ్​ మెంట్​ ముహూర్తాన్ని 8,6 సంఖ్యల ఘడియల్లో  ఈ లవ్​ బర్డ్స్​ ఒక్కటయ్యేందుకు అధికారికంగా అంగీకారం చేసుకున్నారు. 

సంఖ్యాశాస్త్రం ప్రకారం 6 వ నెంబర్​  శుక్రుడికి సంబంధించినది. సాధారణంగా శుక్రుడు ఐశ్వర్యం కలుగజేస్తాడు.అంటే శోభితా .. నాగ చైతన్య కలయిక ముహూర్తం అంత గొప్పదని పండితులు అంటున్నారు. ది. వీరు తమకు ఉన్న విజ్ఞానంతో సంతృప్తి పడరు. కొత్త టెక్నాలజీలు కనిపెట్టడానికి తాపత్రయపడతారు. వీరు తమ రంగంలో తప్పకుండా తమదైన ముద్ర వేస్తారు.

నటి శోభితాతో ప్రేమలో మునిగిపోయాడు నాగ చైతన్య. ఈ ఇద్దరు కలిసి విదేశాలకు పలుమార్లు షికార్లు చేసిన వార్తలు వినిపించాయి. కొన్ని పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఎక్కడా తమ లవ్ గురించి చైతూ కానీ శోభితా కానీ ఓపెన్ కాలేదు. కానీ ఈ మధ్య  చాయ్ (CHAI) అనే వర్డ్ ఉపయోగిస్తూ లాజికల్ స్టేటస్ పెట్టింది అమ్మడు. దీంతో నెటిజన్లు చైతో ఆమె రిలేషన్‌లో ఉందని కన్ఫమ్ అయ్యారు. తాజాగా ఈ జంట పక్షులు ఎంగేజ్ మెంట్‌తో ( 8:8:8 ఫార్ములా) ఒక్కటి అయ్యారని నాగార్జున ట్వీట్ చేశారు.