Dasara Special 2024: నవరాత్రి ఉత్సవాల్లో మూల నక్షత్రానికి ప్రాధాన్యత ఎందుకో తెలుసా

దేశ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు.. దసరా నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి.  మహిషాసుర మర్థిని .. దుర్గాదేవి అమ్మవారు.. రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.  ఈ ఉత్సవాల్లో మూల నక్షత్రం ఉన్న రోజు ( అక్టోబర్​ 9)  చాలా ప్రత్యేకత.. ఈ రోజున  చదువుల తల్లి సరస్వతి దేవిగా కనిపిస్తారు.  ఈ రోజున అక్షరాభ్యాసం జరిగితే విద్యలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని విశ్వశిస్తుంటారు.  

చ‌దువుల తల్లి సరస్వతీదేవి కటాక్షం ఉంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విస్వాసం .. కనకదుర్గ అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం  ఎంతో విశేషమైనది. దసరా వేడుకల్లో మూలా నక్షత్రం  రోజున భక్తులు తండోప తండాలుగా తరలివస్తారు. మహాకాళి, మహాలక్ష్మి , మహా సరస్వతిగా  త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తన అంశంలోని నిజస్వరూపాన్ని సాక్షాత్కరించడమే మూలా నక్షత్రం రోజు చేసే అలంకారం ప్రత్యేకత. 

కనకదుర్గా దేవి అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం.. ఈ నక్షత్రానికి అధి దేవత సరస్వతీ దేవి.  మూల నక్షత్రం సమయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహిస్తుంటారు.  అలాగే దసరా నవరాత్రి ఉత్సవాల్లో సరస్వతి దేవికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు.  ఏరంగంలో రాణించాలన్నా.. విద్యే ప్రధానం.. దానిని ప్రసాదించే దేవత సరస్వతి దేవి అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున ( అక్టోబర్​9) సరస్వతి కటాక్షం కోసం పిల్లలచే పూజలు చేయిస్తారు.   బ్రహ్మ చైతన్య సవరూపిణిగా పురాణాలు వర్ణిస్తున్నాయి. శ్వేతాపద్మాన్ని ఆసనంగా అధిష్టించి వీణ , దండ , కమండలం , అక్షమాల ధరంచి నెమలితో కూడి అభయముద్ర ధరంచి భక్తుల అజ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది.మహాకాళి, మహాలక్ష్మి , మహా సరస్వతిగా త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తన అంశంలోని నిజస్వరూపాన్ని సాక్షాత్కరించడమే మూలా నక్షత్రం రోజు చేసే అలంకారం ప్రత్యేకత.

చింతామణి, జ్ఞాన, నీల, ఘట, కిణి , అంతరిక్ష మహా సరస్వతులుగా సప్తనామాలతో వాగ్దేవి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధి ప్రదా యినిగా విరాజిల్లుతుంది.వ్యాసుడు , వాల్మీకి, కాళిదాసు, మొదలటు వారు కూడా సరస్వతి దేవిని పూజించిన తరువాతనే గ్రంథాలు లిఖించడం ప్రారంభించారని.. అందుకే వారి నాలుక నుంచి వచ్చిన మాటలే  లోకోత్తర చరిత్రలో ఎంతో  వైభవాన్ని ఇచ్చాయని పురాణాలు చెబుతున్నాయి. . ఈమెను కొలిస్తే విద్యార్థులకు బుద్ధి వికాసం జరుగుతుంది. సంగీత, సాహిత్యా లకు అదిష్టానదేవత. సకల జీవుల జిహ్మాగ్రంపై ఈమె నివాసం ఉంటుంది. త్రిశక్తి స్వరూపాల్లో మూడవ శక్తి రూపం సరస్వతీదేవి అమ్మవారు.ఈ మూలా నక్షత్రం నాడు అమ్మవారిని పూజిస్తే.. వాగ్దేవి మీ నాలుక‌పై న‌ర్తిస్తుంది... చ‌దువుల తల్లి సరస్వతీదేవి కటాక్షం ఉంటే సకల శుభాలు కలుగుతాయని  పండితులు చెబుతున్నారు.