మీకు తెలుసా : శ్రావణమాసంలో  ఏ రోజు.. ఏ నగలు పెట్టుకోవాలో.. ఈ లిస్ట్ మీ కోసమే..!

ఈ రోజుల్లో చాలా మందికి ఏడు వారాల నగల గురించి తెలియదు. సినిమాల్లో చూడటం, పెద్దల మాటల్లో వినడమే. ఏడు వారాల నగలంటే ఏంటి? ఏ రోజు ఏ నగ వేసుకోవాలో తెలుసుకోండి. . 

ఏడువారాల నగలను ఒక్కోటి ఒక్కోరోజు వారం పాటు అందంగా అలంకరించుకునేవాళ్లు పూర్వం... కాని ఈ మోడ్రన్ యుగంలో అవన్నీ ట్రంకు పెట్టెలకే పరిమితం అయ్యాయి. కానీ శ్రావణమాసంలో మాత్రం వీటి సందడి కాస్త కనిపిస్తుంది. ఈ నెలంతా శుభకార్యాలు, పూజలే ఉండటంతో ఏడువారాల నగలను ఇష్టంగా వేసుకుంటున్నారు కొందరు.

  • ఆదివారం: సూర్యుని అనుగ్రహం కోసం ...కెంపులతో తయారుచేసిన కమ్మలు, హారాలు, గాజులు
  • సోమవారం: చంద్రుని అనుగ్రహం కోసం .. ముత్యాలహారం, ముత్యాల గాజులు
  • మంగళవారం: కుజుని అనుగ్రహం పొందాలంటే ... పచ్చల పతకాలు.. పచ్చ రత్నంతో  తయారు చేసిన కమ్మలు, గాజులు
  • బుధవారం: బుధుని అనుగ్రహం కోసం పచ్చల పతకాలు.. పచ్చ ఉంగరం, కమ్మలు, గాజులు ధరించాలి
  • గురువారం: బృహస్పతి అనుగ్రహం కోసం... పుష్యరాగం... దీనితో తయారు చేసిన కమ్మలు, ఉంగరాలు, గాజులు.. హారంలో పుష్యరాగం ఉండేలా చూసుకోవాలి. 
  • శుక్రవారం: శుక్రుని అనుగ్రహం ఉంటే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఆయన ఆశీస్సులు పొందాలంటే... వజ్రాల హారాలు.. వజ్రంతో తయారు చేసిన ముక్కుపుడక, వజ్రాల గాజులు.  అయితే వజ్రం చాలా ఖరీదు ఉంటుంది.  ప్రస్తుతం మార్కెట్​లో అమెరికన్​ డైమండ్​ లభిస్తుంది.
  • శనివారం: శని ప్రభావం పడకుండా ఉండేందుకు నీలం అనే రత్నాన్ని ధరించాలి. ఉంగరాలు, గాజులు, లేకుండా ఏ నగలోనైనా నీలాన్ని ఉంచి తయారు చేసుకోవచ్చు.

డబ్బున్నవాళ్లే కాదు

నగలంటే ఇష్టపడని స్త్రీలు ఎవరూ ఉండరు. అలాంటి నగల గురించి తెలుసుకోవడం. ధరించడం అందరికీ వచ్చే విషయమే. అయితే ఏడువారాల నగలన్నీబంగారంతోనే తయారవ్వాలని లేదు. వెండి, ఫ్యాన్సీ జువెలరీలో కూడా ఏడువారాల నగలున్నాయి.

శుభకార్యాల్లో ఎక్కువగా....

ఇంతకుముందు తరచూ కనిపించిన ఈ నగలు ఇప్పుడు ఎక్కువగా శుభకార్యాలోనే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో బాగా కనిపిస్తున్నాయి. నిండుదనం ఎక్కువగా ఉండటంతో పెళ్ళికూతుడు ఈ నగలతోనే అలంకరించుకుంటుంది.

సూపర్​ హిట్​ అయ్యాయి...

ఏడు వారాల నగలను మోడల్​గా తీసుకుని చాలా  డిజైన్స్​ను మార్కెట్ లో  రిలీజ్ చేశారు డిజైనర్లు. ​  దాదాపు ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న నగలన్నీ ఏడు వారాల నగల నుండి వచ్చినవే.. ఓల్డ్ డిజైస్ కే సరికొత్త హంగులు అద్దిన సగలు మార్కెట్ సూపర్​ హిట్ అయ్యాయి. ఏడువారాల నగల మోడల్స్​లో వచ్చిన ముత్యాల హారాలు.. పచ్చ హారాలు నీల మణిహారాలు నేటితరం వాళ్లని కూడా ఎట్రాక్ట్​ చేస్తున్నాయి.