సోమావతి అమావాస్య రోజున ..ఇలా చేయండి... పాపాలు పోతాయి

సోమవారం అంటే శివుడికి చాలా ప్రీతి..ఇక ఆ రోజు అమావాస్య వచ్చిందంటే  ఆ రోజు విశిష్టత గురించి చెప్పనక్కరలేదు.   ఆరోజును సోమావతి అమావాస్య అంటారు. పంచాంగం  ప్రకారం.. డిసెంబర్ 30న తెల్లవారుజామున 3.42 నిమిషాలకు ఈ ఘడియలు ప్రారంభమయ్యాయి.  

సోమావతి అమావాస్య రోజు ఉపవాసం ఉండి.. ప్రదోష కాలంలో అంటే సూర్యాస్త సమయంలో రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేయాలని పండితులు చెబుతున్నారు.  ఇలా చేస్తే కొన్ని కోట్ల సూర్య గ్రహణాల రోజుల్లో పూజ ఫలితం దక్కుతుందని పండితులు అంటున్నారు.  సోమావతి అమావాస్య రోజు సాయంత్రం శివుడిని అర్చించి.. రావి చెట్టుకు పూజలు చేసి సోమాపతి కథను చదువుకోవాలి.

సోమావతి అమావాస్య రోజున చాలా ప్రశాంతంగా ఉండాలి.  మౌనవ్రతం పాటిస్తే చాలా మంచిది. పేదవారికి అన్నదానం... వస్త్రదానం చేయాలి.  బ్రాహ్మణులకు స్వయం పాకం ఇస్తే సంతాన వృద్ది కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక రావి చెట్టు దగ్గర ప్రదక్షిణాలు చేసే సమయంలో శని మంత్రాన్ని పఠించాలి.  ఎందుకంటే  రావి చెట్టు మొదట్లో జ్యేష్టాదేవి ఉంటుంది.  ఈమె శని భగవానుడికి భార్య. అలాగే శని దేవుడితో పాటు శ్రీమన్నారాయణుని కూడా పూజించాలి.  తరువాత శివుడిని పూజించాలి.  ఇలా చేసిన వారు ఎన్నో జన్మల నుంచి చేసిన పాపాలు తొలగుతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. 

పుణ్య నదుల్లో స్నానమాచరిస్తే ఐశ్వర్యం కలుగుతుంది.  త్రివేణి సంగమం ఉన్న నదులైనా చాలా శ్రేష్టం.  నదీ తీరంలో పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వాలి.   ఇలా చేయడం వలన పితృదేవతలు ఉన్నత లోకానికి వెళ్లేందుకు ఏర్పడిన ఆటంకాలు తొలగుతాయి.  దీర్ణకాలిక రోగాలు.. బాధలు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు.  ఇంకా గోదానం చేయడం ఎంతో పుణ్య ఫలం లభిస్తుంది. 

సోమావతి అమావాస్య  కథ

పూర్వం ఒక వర్తక వ్యాపారి ఇంటికి ఒక సాధువు వచ్చేవాడు. ఆ వ్యాపారికి వివాహమైన ఏడుగురు కుమారులు, పెళ్లికాని కుమార్తె ఉండేవారు. ఒకరోజు పెళ్ళికాని ఆ కుమార్తెనును ఆ సాధువు చూసి కూడా దీవించకుండా వెళ్ళిపోతాడు. దీనికి వారు చాలా బాధపడి దీని గురుంచి అడగడానికి ఒక పురోహితుడి దగ్గరకి వెళ్లి తమ కుమార్తె జాతకాన్ని చూపిస్తుంది వర్తకుని భార్య. అది చూసి పురోహితుడు ఆమె పెళ్లయిన వెంటనే భర్త చనిపోతాడని చెప్పగా, దానికి వారు చాలా బాధపడి దానికి పరిష్కారమడుగుతారు. 

అప్పుడు పురోహితుడు సింఘాల్ ప్రాంతానికి వెల్లి అక్కడ చాకలి స్త్రీ కుంకుమ అడిగి నుదుట పెట్టుకుంటే దోషం పోతుందని చెప్తాడు. మర్నాడు వ్యాపారి కుమారుల్లో చిన్నవాడు, తన తల్లి ఆజ్ఞ మీద తన సోదరితో కలిసి వెళతాడు.వీరు వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక నది దాటాల్సివస్తుంది .ఆ నది ఎలా దాటాలా అని ఆలోచిస్తూ ఆ చెట్టుక్రింద విశ్రాంతి తీసుకుంటుంటారు.

ఆ చెట్టుపైన ఒక రాబందు గూడు ఉంటుంది. ఆ రాబందుల జంట లేని సమయంలో ఒక పాము వచ్చి రాబందు పిల్లలను తినటం పరిపాటి. ఈ సారి కూడా అలా పాము ప్రయత్నించడం చూసిన ఈ అమ్మాయి ఆ పామును చంపేస్తుంది. దీనికి ఆ రాబందుల జంటతన పిల్లలను కాపాడినందుకు వారికి ఆ నదిని దాటడానికి సహాయ చేస్తుంది. వీరు అక్కడికి వెళ్ళి ఆమెకు కొన్ని నెలలు సేవ చేయగా, ఈ సోమావతి అమావాస్యరోజున ఈ కన్య నుదుటన చాకలి స్త్రీ కుంకుమ దిద్దుతుంది. ఆమె వెంటనే రావిచెట్టు దగ్గరకి వెళ్లి 108 ప్రదక్షిణలు చేస్తుంది. అంతటితో ఆమె జాతక దోషం తొలగిపోతుంది. ఇది సోమావతీ అమావాస్య కథ.