ఆగస్టు 4 ఆషాఢ అమావాస్య.. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందట

అమావాస్య తిథి.. అందునా ఆషాఢమాసంలో వచ్చే అమావాస్య తిథికి మరింత ప్రాధాన్యత ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున దానాలు చేస్తే పితృ అమావాస్య రోజున దక్కినంత ప్రతిఫలం లభిస్తుందట. వాస్తవానికి ఆషాడ మాసంలోని అమావాస్య రోజనున మరణించిన పూర్వీకులు కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారట. కాబట్టి ఆ రోజున మనం చేసే కొన్ని పనులు వారికి సంతోషాన్ని కలిగిస్తాయని అంటారు. ఈ ఏడాది ఆగస్టు 4న ఆషాఢ  అమావాస్య వచ్చింది.   ఆ రోజున ఏం చేయాలి? అలా చేస్తే వచ్చే ఫలితాలు ఏంటో తెలుసుకుందాం.. 

వైదిక శాస్త్రం ప్రకారం హిందు పురాణాల ప్రకారం ఆషాఢ  అమావాస్యకు  ప్రాముఖ్యత సంతరించుకుంది.   ఎందుకంటే ఈ అమావాస్య తిథి శ్రీ మహా విష్ణువుకి అంకితం చేయబడినది. ఈ అమావాష్య రోజును విష్ణువును పూజిస్తారు. ఆషాఢ అమావాస్య రోజును కొన్ని నియమాలను పాటిస్తే మంచిదని,వాటి ద్వారా అఖండ రాజయోగంతో పాటు లక్ష్మీ కటాక్షం  పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. 

 ఆషాఢ అమావాస్య రోజును పిత్రు దేవుళ్లను స్మరించుకొని వారిని గౌరవించాలి . ఆషాఢ అమావాస్య రోజు పితృలకు పిండప్రధానం చేస్తారు.ఈ రోజున నిర్దిష్టమైన ఆచారాలు నిర్వహించడం వల్ల మరణించిన(పితృలు) వాళ్ళు శాంతి పొందుతారని, వారి ఆధ్యాత్మిక ప్రయాణం సులభతరం అవుతుందని హిందువులు నమ్ముతారు. ఆ రోజు ( ఆగస్టు 4) వారి పేరుమీద చేసే ధానదర్మాల వల్ల విశేష ప్రయోజనాలు పొందుతారు. 

ఆషాడ అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు కుశ, నల్ల నువ్వులు, తెల్లటి పువ్వులను చేతిలో ఉంచుకుని తర్పణం చేయాలి. అశ్వత్థ చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించాలి. ఈ వృక్షంలోనే మన పూర్వీకులు ఉంటారని నమ్మకం. ఆపై వారి పేర్లతో పేదలకు బట్టలు, ధాన్యాన్ని, పిండిని దానంగా ఇస్తే చాలా మంచిదట. అలాగే ఉప్పు, పంచదారను కూడా దానం ఇవ్వవచ్చు. 

ఆషాఢ అమావాస్య రోజున పాటించాల్సిన నియమాలు 

ఆషాడ అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలేవకూడదు. అలా లేస్తే దరిద్ర  దేవత తిష్టవేసుకుని కూర్చుటుంది. ఆషాడ అమావాస్య నాడు పాటించే నియమాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే మన ఇంట్లో ఉన్న దరిధ్రదేవతని తరిమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు.

అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అలా ఈ రోజున తలస్నానం చేకపోతే దరిద్రం చుట్టుకుంటుంది. మరొక విషయం ఏంటంటే ఈ రోజున ఎట్టి పరిస్థితిలో తలకు నూనె రాయకూడదు. అమావాస్య రోజున మీ పూజ గదిలో లక్ష్మీ దేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి అందులో ఒక మట్టి ప్రమిద పెట్టి అందులో 5 వత్తులు వేసి దీపారాధన చేయాలి. అలా ఈ దీపాన్నీ లక్ష్మీ దేవి పటం ముందు ఉంచి దీపారాదన చేయాలి. ఇలా ఎవరైతో చేస్తారు అలాంటి వారికి అష్ట దరిద్రాలు పోయి, అష్టఐశ్వార్యాలు లభిస్తాయి.

 పౌరాణిక  గ్రంథాల ప్రకారం ఈ అమావస్య  పూజలు ...  ఉపవాసాలు చేయడం వల్ల పాపాలు నశిస్తాయి. అలాగే ఇంటి ఈశ్యాన్యంలో దీపారాధన చేయండి. ఇలా చేస్తే లక్ష్మీ దేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. అలాగే దీపాలకు ఆవు నెయ్యి ఉపయోగించండి. అమావాస్య రోజున ఇంట్లో చీమలు కనబడితే వాటి ఆహారం వేయండి. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదలు పొందుతారు. మీకోరికలు నెరవేరుతాయి. 

ఇక ఈ మద్య కాలంలో ద్రుష్టిని తొలగించుకోవడానికి కాళ్ళకు నల్లదారం కట్టుకుంటున్నారు. అమావాస్య రోజున ఆ దారం తొలగించి కొత్తదారాన్ని కట్టుకోండి, అలా చేయడం వల్ల మీపై నర ద్రుష్టి తగలదు. అలాగే ఆర్థిక కష్టాలు ఉండవు. ఆడవాళ్ళు ఎడమకాలికి, మగవాళ్లు కుడికాలికి కట్టుకోవాలి. 

చాలా కాలం నుండి డబ్బు సమస్యలతో బాధపడుతుంటే గాయత్రీ మంత్రం జపించడం ద్వారా డబ్బు సమస్యలు తీరుతాయి. అమావాస్య రోజున రాత్రి నిద్రించే ముందు 11 లవంగాలను ఒక గిన్నెలో తీసుకుని ,వాటి మీద నెయ్యి వేసి కాల్చాలి. లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాప్తి చెందడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. తద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

 అమావాస్య అంటే లక్ష్మీ దేవికి అంత్యంత ప్రీతకరమైన రోజు. అమావాస్య రోజున సాయంత్ర సమయంలో ఒక రాగి చెంబులో నీళ్ళు పోసి దాన్ని ఇంటి గుమ్మం ముందు ఉంచండి, ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిధ్ర దేవత వెళ్లిపోతుంది.మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు.

 అమావాస్య రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచి, దానిమీద స్వస్తిక్ చిహ్నం రాయండి. మీ బీరువాలు చిన్న లక్ష్మీ కాయిన్ లేదా లక్ష్మీ ఫోటోను ఉంచడం వల్ల బీరువాలో లక్ష్మీ దేవి స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది. తద్వారా మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. లక్ష్మీ దేవికి ఎరుపు వస్త్రం అటే ఇష్టం కాబట్టి, అమావాస్య రోజును బీరువాలో ఎరుపు వస్త్రాన్ని పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఆదాయం బాగా పెరుగుతుంది. అమావాస్య రోజును స్నానం నీటిలో పసుపువేసుకుని స్నానం చేస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి,అలాగే ఇంట్లో కూడా పసుపునీళ్ళు చల్లడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. 

అమావాస్య రోజును గోవుకి ఆహారం ఇవ్వడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఆషాఢ అమాస్య రోజున గోవుకు గట్టి తినిపిస్తే కష్టాలు తొలగిపోయి తరతరాల ఐశ్వర్యం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ఇక చేయకూడని పనులేంటంటే.. 

  • పొరపాటున కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు. 
  • మద్యం మాంసాన్ని ముట్టడం కానీ.. గొడవలు పడటం కానీ చేయకూడదు. 
  • ఎవరైనా బిక్షగాడు మన ఇంటికి వస్తే ఖాళీ చేతులతో పంపించకూడదు.