పుష్యమాసం.. శని భగవానుడికి ప్రీతికరం.. 30 రోజులు పూజలు చేయండి.. కష్టాలు తొలగుతాయట..

హిందూ పంచాంగం ప్రకారం 2024 డిసెండర్ 31 నుంచి పుష్యమాసం ప్రారంభమైంది.  కార్తీకంలో శివుడిని.. మార్గశిరంలో విష్ణుమూర్తిని ఎలా పూజిస్తామో అలాగే పుష్య మాసంలో 2024 డిసెంబర్ 31 నుంచి నెల రోజుల పాటు శని భగవానుడిని పూజించాలని పురాణాలు  చెబుతున్నారు.

శని  భగవానుడి జన్మ నక్షత్రం పుష్యమి.. జాతక రీత్యా శని దోషం ఉన్నవారు ఈ నెల రోజులు శనిభగవానుడిని పూజించాలి.  ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో ప్రతిరోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తే శని ప్రభావం తగ్గుతుంది. అలాగే పుష్య  పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానం ఇవ్వాలి.  ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. దీనివెనుక శాస్త్రీయ కోణం చూస్తే  ఈ రెండు పదార్ధాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. 

శని భగవానుడు  ధర్మం.. న్యాయం..  సత్యం లను పరిరక్షిస్తుంటాడని పురాణాలు చెబుతున్నాయి.  కోర్టు వివాదాలతో బాధ పడే వారు ఈ నెల రోజులు ( 2024 డిసెంబర్ 31 నుంచి) శని దేవతు పూజిస్తే మీకు అనుకూలమైన ఫలితాలుంటాయని పండితులు చెబతున్నారు. ఇక ఈ నెలలో నువ్వులు.. బెల్లం తో తయారు చేసిన పదార్ధాలను నియమ నిష్టలు ఆచరించి ప్రసాదంగా స్వీకరిస్తే శని అనుగ్రహం కలిగి భాధలు.. కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు.  గరుడ పురాణం ప్రకారం  నాభిస్థానం..  శని స్థానం అని చెప్పబడింది. ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యత ఇచ్చారు. 

పుష్య మాసం ఆధ్యాత్మికత, ఆరోగ్యానికి కూడా పెద్ద పీట వేస్తుందట. ఈ నెలంతా శనీశ్వరుడిని పూజిస్తే ఆయన ప్రసన్నుడవుతాడట. మానవుడు చేసే పాపపుణ్యాల ఆధారంగా ఫలితాన్నిచ్చే ధర్మదేవతగా శనిని పిలుస్తారు. కాబట్టి ఈ మాసంలో శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులూ ఉండవట.. ఇంకా ఈ నెలలో శని భగవానుడితో పాటు  పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు శ్రీ హరిని తులసీదళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని భక్తులు విశ్వశిస్తుంటారు.  అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ ఆ.. దివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. పుష్య మాసం శుక్ల పక్ష షష్ఠినాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. 

హిందూ పురాణాల ప్రకారం పుష్యమి నక్షత్రాన్ని అద్భుతమైన నక్షత్రంగా పేర్కొంటారు. ఈ మాసంలో సూర్యోదయ కాంతి యోగ చైతన్యాన్ని ప్రసరిస్తుందట. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే సమయం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఏర్పడుతుంది. ఈ పుణ్యకాలంలో దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశగా సూర్యుడి ప్రయాణం కొనసాగుతుంది. ఈ సమయంలో సూర్య కిరణాలలో ఒక ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది. కాబట్టి ఈ కాంతి మన బుద్ధిని ప్రచోదనము చేస్తుందట. తద్వారా మనస్సులోని చెడు ఆలోచనలు, చెడు స్వభావాన్ని, అశుభాలను హరించి వేస్తుందట. కాబట్టి పుష్య మాసం.. మనకు బుద్ధి బలాన్ని, ప్రాణ బలాన్ని పుష్టిగా ఇస్తుందని పండితులు చెబుతున్నారు.