మద్యం అమ్మితే.. రూ. 5 లక్షలు..తాగితే రూ.10 వేలు ఫైన్.. ఎక్కడంటే..

  •     సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్  గ్రామస్తుల తీర్మానం

జగదేవపూర్, వెలుగు: మద్యం అమ్మితే.. రూ. 5 లక్షలు, తాగితే.. రూ. 10 వేలు జరిమానా విధిస్తూ  సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామస్తులు తీర్మానించారు.  శుక్రవారం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసుకోగా.. పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. బెల్ట్ షాప్ తో యువకులు మద్యానికి బానిసలై కుటుంబాలు ఆగమవుతున్నాయన్నారు.

 ఎవరైనా దొంగ చాటున మద్యం అమ్ముతున్నారనే సమాచారాన్ని గ్రామస్తుల దృష్టి తీసుకొస్తే రూ.5 వేల నగదు ప్రోత్సాహకం అందిస్తామన్నారు. తిమ్మాపూర్ ను మద్యపాన రహితంగా తీర్చిదిద్దుకుం టామని తీర్మానం రాసి ఆ  పత్రాన్ని జగదేవపూర్ ఎస్ఐ చంద్రమోహన్ కు అందజేశారు. గ్రామస్తులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.