- రెండు లక్షల నగదు బహుమతి
సిద్దిపేట, వెలుగు: గడిచిన ఆర్థిక సంవత్సరంలో అన్ని రంగాల్లో మంచి ప్రగతిని సాధించినందుకు రాష్ట్ర స్థాయిలో సిద్దిపేట ఆర్టీసీ బస్ డిపో మూడో స్థానంలో నిలిచింది. శనివారం హైదరాబాద్ లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి అవార్డుతో పాటు రూ.2 లక్షల నగదు బహుమతి అందుకున్నారు.
ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ సిబ్బంది కష్టపడి పనిచేయడం వల్ల ఈ అవార్డు వచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి సంస్థను సిద్దిపేట డిపోను లాభాల బాటలో తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు.