అవకాశవాదులు మాత్రమే పార్టీ మారారు : మాజీ మంత్రి హరీశ్ రావు

  • మాజీ మంత్రి హరీశ్ రావు 

పటాన్​చెరు(గుమ్మడిదల),వెలుగు: అవకాశవాదులు మాత్రమే పార్టీలు మారుతారని, నికార్సయిన కార్యకర్తలు బీఆర్ఎస్ లోనే ఉంటారని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో ఇటీవల బీఆర్ఎస్​నూతన కమిటీలను ఏర్పాటు చేయగా అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రభాకర్​ రెడ్డి, కమిటీ సభ్యులు, బీఆర్ఎస్​ నేతలతో కలిసి హరీశ్​రావును తన నివాసంలో గురువారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీ అన్నారు.

 అలాంటి పార్టీ గత 20 ఏళ్లుగా ఎన్నో కష్టాలను చూసిందన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ 10 నెలలు గడుస్తున్నా నేటి వరకు ఇచ్చిన  హామీలను అమలు చేయలేక పోయిందని విమర్శించారు. సొంత  ప్రయోజనాల కోసం ఇతర పార్టీలోకి వెళ్లే నాయకుల కారణంగా పార్టీకి నష్టమేమీ లేదన్నారు.

 కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి, కార్పొరేటర్ కుమార్ యాదవ్, ఆదర్శ్ రెడ్డి, బాల్​రెడ్డి, వెంకటేశం గౌడ్, మల్లేశ్ గౌడ్, నరహరి, వెంకటేశ్ గౌడ్, సంతోష్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వేణు, రాజు, మురళి, రుక్మారెడ్డి, శంకర్, శ్రీనివాస్, పద్మా రెడ్డి, సత్యనారాయణ, ఆంజనేయులు యాదవ్, యాదగిరి పాల్గొన్నారు.