- నకిలీ బంగారం కేసులో సొమ్ము స్వాహా
- మేజర్లయిన ప్రేమ జంటను విడదీసిన ఆఫీసర్
- నిజమేనని తేలడంతో చర్యలు
గజ్వేల్, వెలుగు : సిద్దిపేట జిల్లా గౌరారం ఎస్సై జే శివకుమార్అవినీతికి పాల్పడడంతో మల్టీ జోన్ఇన్చార్జి ఐజీపీ యస్.చంద్రశేఖర్ రెడ్డి గురువారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని సిద్దిపేట సీపీ అనురాధ తెలిపారు. ఎస్సై శివకుమార్ నకిలీ బంగారం కేసులో రికవరీ చేసిన సొమ్ములో కొంత మొత్తాన్ని కోర్టుకు అప్పగించకుండా తన వద్దే ఉంచుకున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లింది.
దీంతో పాటు మేజర్లయిన ప్రేమ జంట వ్యవహారంలో అమ్మాయి, అబ్బాయి తరపువారు పోలీసులను ఆశ్రయించగా, ఒకవైపు నుంచి డబ్బులు తీసుకుని ఇద్దరినీ బలవంతంగా విడదీసినట్టు ఆరోపణలు వచ్చాయి. వీటిపై ప్రాథమిక విచారణ తర్వాత జులై 28న ఎస్సైని సీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు. తర్వాత ఆరోపణలు నిజమేనని తేలడంతో గురువారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.