కాఫీ డే ఎంటర్‌ప్రైజస్(సీడీఈఎల్) ఇబ్బందుల్లో పడటానికి మెయిన్ ప్రాబ్లమ్ చనిపోయిన వీజీ సిద్ధార్ద్ కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థని ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో తేలింది. ఆ ప్రైవేట్ సంస్థ కారణంగా సీడీఈఎల్ బుక్స్‌లో రూ.2,600 కోట్ల మోసం జరిగినట్టుతెలిసింది. 2018–19 మధ్య సీడీఈఎల్‌కు, మైసూర్ అమాల్గ్‌మేటెడ్ కాఫీ ఎస్టేట్స్(ఎంఏసీఈఎల్) మధ్య జరిగిన రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్‌పై అనుమానం వ్యక్తమవుతుంది. సీబీఐ మాజీ డీఐజీ అశోక్ కుమార్ మల్హోత్రా రూపొందించిన ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ త్వరలోనే ప్రజల ముందుకు రాబోతుంది. కాఫీడే గ్రూప్, సిద్ధార్థ సొంత కంపెనీలకు మధ్య జరిగిన ట్రాన్సాక్షన్స్, ఆయన ఆత్మహత్యకు ముందు రాసిన లేఖపై ఇన్వెస్టిగేట్ చేయడానికి మల్హోత్రాను అపాయింట్ చేశారు. పేరెంట్ కంపెనీ, సిద్ధార్ద్ కు చెందిన ప్రైవేట్ కంపెనీల అకౌంట్స్ బుక్స్‌ను ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దీనిలో 2019 సీడీఈఎల్ యాన్యువల్ రిపోర్లో ట్ ఎంఏసీ ఈఎల్‌కు ఇచ్చిన లోన్లు, అడ్వాన్స్‌లు రూ.2,226 కోట్లకు జంప్ చేసినట్టుపేర్కొంది. అయితే అంతకు ముందు ఏడాది ఇవి రూ.724 కోట్లుగానే ఉన్నాయి. రూ.2,226 కోట్లలో రూ.1,450 కోట్లురికవరీ అయినట్టుయాన్యువల్ రిపోర్లో ట్ తెలిపింది. సర్‌ప్రైజింగ్‌గా ఎంఏసీఈఎల్ 2019 బ్యాలెన్స్ షీటులో లోన్లు రూ.553.6 కోట్లుగానే ఉన్నాయి. సీడీఈఎల్‌లో మాత్రం ఎంఏసీఈఎల్ నుంచి పొందిన నెట్ అడ్వాన్స్‌లు రూ.777.6 కోట్లుగా, ల్యాండ్ కొనుగోలుకు రూ.789.3 కోట్లుగా, గూడ్స్, సర్వీసెస్ కొనుగోలు అడ్వాన్స్‌లు రూ.64.8 కోట్లుగా పేర్కొంది. సీడీఈఎల్, ఎంఏసీఈఎల్ బుక్స్‌ను పరిశీలిస్తే ఈ ట్రాన్సాక్షన్స్ డిఫరెన్స్‌ను వెల్లడవుతోంది. అయితే ఈ లెక్కలపై సీడీఈఎల్ తప్పనిసరిగా వివరణ ఇవ్వాలని, ఇది ఒకపబ్లిక్ కంపెనీ అని ట్యాక్స్ అడ్వయిజరీ సంస్థకేఆర్ గిరీష్ అండ్ అసోసియేట్స్ ఫౌండర్ కేఆర్ ఫౌండర్ అంటున్నారు.
