Siddharthh Kaul: క్రికెట్‌కు రిటైర్మెంట్.. SBI ఉద్యోగంలో చేరిన భారత ఫాస్ట్ బౌలర్

భారత మాజీ పేసర్ సిద్దార్థ్ కౌల్ భారత క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజులకే గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాడు.  భారత బౌలర్  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేరి తన విధులు నిర్వర్తించడానికి సిద్ధమయ్యాడు. కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ ఈ 34 ఏళ్ళ క్రికెటర్ తన ఫోటోను ట్విట్టర్ హ్యాండిల్‌ షేర్ చేశాడు. ఆఫీస్ టైం అని క్యాప్షన్ ఇస్తూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. చండీఘర్ లో అతను జి.పి.ఓ పోస్ట్ లో చేరాడు. కౌల్ భారత క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. గురువారం (నవంబర్ 28) ఇంస్టాగ్రామ్ వేదికగా కౌల్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. 

2018లో సిద్ధార్ధ్ కౌల్ భారత జట్టులో టీ20 క్రికెట్ తో అరంగేట్రం చేశాడు. టీమిండియా తరపున కేవలం మూడు వన్డేలు.. మూడు టీ20లు మాత్రమే ఆడాడు. వన్డేల్లో ఒక వికెట్ దక్కపోగా.. టీ20నాలుగు వికెట్లు పడగొట్టాడు. 2019 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన ఈ పంజాబీ పేసర్ ఈ ఐదేళ్లలో భారత జట్టులో చోటు సంపాదించడంలో విఫలమయ్యాడు. 

ALSO READ : AUS vs IND: 2-0 అవుతుందా..? ఆసీస్ స్టార్ ఆటగాళ్లకు గాయాలు.. అడిలైడ్ టెస్టులో ఫేవరేట్‌గా భారత్

34 ఏళ్ల కౌల్.. పంజాబ్ తరఫున 88 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 26.77 సగటుతో 297 వికెట్లు తీశాడు. 17 సార్లు 5 వికెట్ల ఘనతను సాధించాడు. 2008 అండర్-19 ప్రపంచ కప్ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ గెలుచుకున్నప్పుడు జట్టులో బౌలర్. 2016 ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్  జట్టులో చేరాడు. 55 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 8.63 ఎకానమీతో 58 వికెట్లు పడగొట్టాడు.