ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి : విజయభాస్కర్

అయిజ, వెలుగు: ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడాలని ఎస్ఐ విజయభాస్కర్  సూచించారు. రెడ్ క్రాస్ సొసైటీ, యూత్  సేవా ఫౌండేషన్  ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న వారంతా ఎలాంటి అపోహలకు గురి కాకుండా రక్తదానం చేయాలని కోరారు.

యూత్  సభ్యులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని శిబిరాలు ఏర్పాటు చేసి రక్త నిల్వలు పెంచేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. రెడ్ క్రాస్  సొసైటీ గద్వాల జిల్లా కార్యదర్శి తాహెర్, కాంగ్రెస్  పార్టీ ఎస్సీ సెల్  జిల్లా అధ్యక్షులు మద్దిలేటి, అంజి, యూత్  సభ్యులు మధు, ప్రవీణ్, మహేశ్, అక్షయ్  పాల్గొన్నారు.