53.9 తులాల బంగారం పట్టి వేత

నారాయణపేట, వెలుగు: పట్టణంలో పోలీసుల తనిఖీల్లో 53.9 తులాల బంగారం పట్టుకున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పార్లమెంట్  ఎన్నికల కోడ్  అమల్లో భాగంగా గురువారం రాత్రి మెయిన్ చౌక్ లో వాహనాల తనిఖీ నిర్వహించగా, ఏపీలోని మంగళగిరికి చెందిన రాజు బ్యాగ్ తో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకున్నట్లు చెప్పారు. నారాయణపేట షాపులో అమ్మడానికి వచ్చినట్లు సమాధానం చెప్పినట్లు తెలిపారు. రూ.17 లక్షల విలువ చేసే 53.09 తులాల బంగారం వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

లిక్కర్​ స్వాధీనం..

అలంపూర్: ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలో ఫ్లయింగ్  స్క్వాడ్​ టీమ్​ తనిఖీలు నిర్వహించి నరేశ్  ఇంట్లో రూ.83,450 విలువ చేసే మద్యం బాటిళ్లను సీజ్​ చేసి పోలీస్​స్టేషన్​లో అప్పగించినట్లు ఏఎస్ఐ సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే మండల కేంద్రంలో శుక్రవారం బైక్​పై తీసుకెళ్తున్న కర్నూల్​ జిల్లా తాండ్రపాడుకు చెందిన తెలుగు చిన్నా నుంచి రూ.32,559 విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నరేశ్, చిన్నాపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు.