ఉట్కూర్‌ ఘటనపై సీరియస్‌.. ఎస్‌ఐ  సస్పెండ్  

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఉట్కూర్‌  పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ  బిజ్జ శ్రీనివాసులును సస్పెండ్  చేశారు.  ఈ మేరకు  ఉత్తర్వులు జారీ చేశారు.  శాంతి భద్రతలను పరిరక్షించడంలో విఫలమైనందున శ్రీనివాసులును సస్పెండ్‌ చేసినట్లుగా జిల్లా ఎస్పీ యోగేశ్‌ గౌతమ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతలను కాపాడటంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా   భూవివాదం కారణంగా నారాయణపేట జిల్లా ఉట్కూరులో సంజీవ్‌ అనే వ్యక్తిని కొట్టి చంపిన రాష్ట్రవ్యా్ప్తంగా కలకలం రేపింది., భూ తగాదా కేసులో సంజీవ్‌పై దాడి చేసిన నలుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు.