- జనగామ జిల్లా తరిగొప్పుల ఎస్సైపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన జనగామ జిల్లా తరిగొప్పుల ఎస్సై నరేశ్ యాదవ్కు వారం రోజుల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. బాధితుడికి పరిహారం కింద రూ.50 వేలు చెల్లించాలని ఆదేశించింది. ధాన్యం అమ్మకాల విషయంలో తరిగొప్పుల పోలీస్ స్టేషన్లో గొలుసు నర్సయ్యపై కేసు నమోదైంది.
దీంతో నర్సయ్య.. హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారించిన హైకోర్టు.. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేసి చట్టప్రకారం దర్యాప్తు చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ 4 రోజుల తర్వాత నర్సయ్యను ఎస్ఐ నరేశ్ యాదవ్ అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాడు. దీంతో నర్సయ్య దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై జస్టిస్ కే.సురేందర్ విచారణ చేపట్టారు.