IND vs AUS: ప్రాక్టీస్ మ్యాచ్‌కి గిల్ దూరం.. అడిలైడ్ టెస్టుకు డౌట్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్ తర్వాత టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. రెండో టెస్టుకు పది రోజులు గ్యాప్ రావడంతో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ కోసం ఈ మ్యాచ్ నిర్వహించారు. నవంబర్ 30, డిసెంబర్ 1న జరగబోయే ఈ మ్యాచ్ కు మనుకా ఓవల్‌లో జరగనుంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ కు ఆస్ట్రేలియా క్రికెట్ శుక్రవారం (నవంబర్ 22) 14 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్ కు భారత యువ బ్యాటర్ శుభమాన్ గిల్ దూరం కానున్నాడు.   

అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 న జరగబోయే డే నైట్ టెస్ట్‌కు ముందు ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో టీమిండియా ఆడే ప్రాక్టీస్ మ్యాచ్ కు గిల్ దాదాపుగా దూరం కానున్నట్టు సమాచారం. నివేదికల ప్రకారం గిల్ ఇంకా చేతి వేలి గాయం నుంచి కోలుకోనట్టు తెలుస్తుంది. గాయం తర్వాత వైద్యులు 10-14 రోజులు విశ్రాంతి తీసుకోవాలని గిల్‌కు సలహా ఇచ్చాడు. దీంతో అతను ప్రాక్టీస్ మ్యాచ్ మిస్ కావడంతో పాటు అడిలైడ్ టెస్టుకు ఆడడం అనుమానంగా మారింది. 

ALSO READ | IND vs AUS: ఆ యువ భారత క్రికెటర్ 40కి పైగా టెస్ట్ సెంచరీలు చేస్తాడు: మ్యాక్స్ వెల్

ఇండియా ఏ తో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా గిల్ కు గాయమైంది. స్లిప్ లో క్యాచ్ పట్టే క్రమంలో గిల్ చేతి వేళ్ళకు గాయానికి గురయ్యాడు. ప్రాక్టీస్ మ్యాచ్ లో 28 పరుగులు చేసిన గిల్ పర్వాలేదనిపించాడు. 25 ఏళ్ల గిల్ తన తొలి టెస్టును ఆస్ట్రేలియాపై ఆడాడు. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో 51.80 సగటుతో 259 పరుగులు చేశాడు. వీటిలో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. బ్రిస్బేన్‌లో ది గబ్బాలో జరిగిన చివరి టెస్టులో 91 పరుగులు చేసి భారత్ సిరీస్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు.