క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలం మరికొన్ని గంటల్లో షురూ కానుంది. నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డా(సౌదీ అరేబియా) వేదికగా మధ్యాహ్నం 3:30 గంటల నుంచి వేలం ప్రారంభం కానుంది. రెండు రోజులపాటు జరిగే ఈ ఈవెంట్‌లో 577 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఇదిలావుంటే, ఐపీఎల్ వేలానికి ఒకరోజు ముందు భారత క్రికెటర్, కేకేఆర్ మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడుతున్న అయ్యర్.. శనివారం గోవాతో జరిగిన మ్యాచ్‌లో 47 బంతుల్లోనే శతకం బాదాడు. అంతటితో అతని విధ్వంసం ఆగలేదు. 57 బంతుల్లో 11ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో మొత్తంగా 130 పరుగులు చేశాడు. దాంతో, ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 250 పరుగులు చేసింది. ఛేదనలో గోవా 224 పరుగులు చేయడం గమనార్హం.
#100@105of70Mumbai @Shreyasian96 @ShreyasIyer15 @Rajiv1841 @ShreyasIyer96FC pic.twitter.com/IbGGTKucUJ
— Groom VJ (@Rishabpant7729) November 23, 2024
దేశానికి ఏనాడైనా ఆడావా..!
పేలవ ఫామ్‌తో జాతీయ జట్టులో చోటు కోల్పోయిన అయ్యర్.. ఉన్నట్టుండి మెరుపు ఇన్నింగ్స్ ఆడటంపై విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో సెంచరీల మీద సెంచరీలు చేసే అయ్యర్.. దేశం కోసం దేశానికి ఏనాడైనా ఇలాంటి ఇన్నింగ్స్ ఆడావా..! అని నెటిజెన్స్ అతనిపై ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఒక యూజర్ ఏకంగా ఐపీఎల్ డబ్బు కోసమే ఇదంతా అని విమర్శించాడు. "మరికొన్ని గంటల్లో ఐపీఎల్ వేలం ఉంది కదా.. ఇప్పుడు ఆడితే కోట్లు కొల్లగొట్టొచ్చు.." అని కామెంట్ చేశాడు.
మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా సేవలు అందించగల అయ్యర్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడొచ్చు. రూ.14 నుంచి రూ.16 కోట్ల వరకూ పలకొచ్చని విశ్లేషకుల అంచనా.