IPL Auction 2025: సరికొత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర శ్రేయాస్ అయ్యర్

ఐపీఎల్ 2025 లో శ్రేయాస్ అయ్యర్ కు ఊహించినట్టుగానే జాక్ పాటు తగిలింది. వేలంలో అతని కోసం ఫ్రాంచైజీలు తెగ ఎగబడ్డారు. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ అయ్యర్ ను తీసుకోవడానికి పోటీ పడ్డారు. ఈ రెండు ఫ్రాంచైజీలకు కెప్టెన్సీ అవసరం ఉండడంతో  అయ్యర్ ను తీసుకోవడానికి బాగా ఆసక్తి చూపించాయి. చివరికి శ్రేయాస్ అయ్యర్ ను రూ. 26.75 కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. 

అయ్యర్ 2024 ఐపీఎల్ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు కెప్టెన్సీ వహించాడు. అతని నాయకత్వంలో కేకేఆర్ టైటిల్ గెలుచుకుంది. కేకేఆర్ అతన్ని రిటైన్ చేసుకోకుండా రిలీజ్ చేయడంతో భారీ ధర పలికింది. అయ్యర్ శనివారం (నవంబర్ 23) ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరుపు సెంచరీ చేయడం కలిసి వచ్చింది. ముంబై కి చెందిన శ్రేయాస్ పంజాబ్ తరపున ఆడడం ఇదే తొలిసారి. గతంలో అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల తరపున ఆడాడు. అర్షదీప్ సింగ్ ను ఇదే వేలంలో రూ. 18 కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.