ముంబై: డిజిటల్ అరెస్ట్ పేరుతో డబ్బులు గుంజుదామనుకున్న స్కామర్ల నుంచి ఓ వ్యక్తి చాకచక్యంగా తప్పించుకున్నడు. వీడియో కాల్ చేసి పోలీసులమంటూ బెదిరించిన సైబర్ నేరగాడికి తన కుక్కపిల్లను చూపించి బురిడీ కొట్టించాడు. ముంబైకి చెందిన వ్యక్తికి వచ్చిన వీడియో కాల్‌ను లిఫ్ట్ చేయగా, అందులో పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న వ్యక్తి మాట్లాడాడు. తాను ముంబైలోని అంధేరి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నానని స్కామర్ బెదిరించాడు.
ఫోన్ కెమెరా ముందు కూర్చోవాలని దబాయించాడు. బాధితుడు బెదరకుండా తన కుక్కపిల్లను కెమెరా ముందుంచి ఇదే నేనంటూ మాట్లాడాడు. ‘‘ఇక్కడున్నది నేనే.. చెప్పండి నకిలీ యూనిఫామ్ సార్’ అని అనేసరికి ఆ స్కామర్ నవ్వాపుకోలేకపోయాడు. తేరుకుని వెంటనే వీడియో కాల్ కట్ చేశాడు. ఈ సీన్ అంతా రికార్డ్ చేసి బాధితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది.