విశాఖ జనసేన సభలో కరెంట్ షాక్

విశాఖ జనసేన సభలో కరెంట్ షాక్

విశాఖ జనసేన బహిరంగ సభలో అపశృతి చోటుచేసుకుంది. సభా వేదిక వద్ద బారికేడ్లకు శాట్ సర్క్యూట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్యకర్తలకు గాయలయ్యాయి. గాయపడ్డ వారిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. షాట్ సర్క్యూట్ తో అప్రమత్తమైన అధికారులు పవర్ సప్లైను నిలిపివేశారు.

రాష్ట్రంలో ఇసుక కొరతకు నిరసనగా జనసేన మద్దిలపాలెం నుంచి లాంగ్ మార్చ్ చేపట్టింది. ఈ కార్యక్రమానికి పవన్, నాగబాబుతో పాటు జనసేన కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు భారీగా తరలి వచ్చారు.టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, అయన్నపాత్రుడు హాజరయ్యారు.