వే2న్యూస్​కి రూ. 130 కోట్ల ఫండింగ్​

వే2న్యూస్​కి రూ. 130 కోట్ల ఫండింగ్​

హైదరాబాద్​, వెలుగు : షార్ట్​ న్యూస్​ యాప్​ వే2న్యూస్​కు రూ. 130 కోట్ల ఫండింగ్​వచ్చింది. ప్రాంతీయ భాషలలో షార్ట్ ఫార్మాట్​లో న్యూస్​ అందిస్తున్న ఈ కంపెనీలో వెస్ట్ బ్రిడ్జ్​ క్యాపిటల్, వెంచర్​ క్యాపిటలిస్ట్​ శశి రెడ్డిలు ​ఏ సిరీస్​రౌండ్​ కింద ఈ పెట్టుబడి పెట్టారు. మన దేశంలో మీడియా, ఎంటర్​టెయిన్​మెంట్​ రంగంలో వెస్ట్​బ్రిడ్జ్​ క్యాపిటల్​ పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారని వే2న్యూస్​ ఒక స్టేట్​మెంట్లో తెలిపింది. తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలలో కార్యకలాపాలు విస్తరించేందుకు, ఎడిటోరియల్​, సేల్స్,​ ఉద్యోగుల సంఖ్య పెంచేందుకు ఈ డబ్బు వాడుకోనున్నట్లు పేర్కొంది. న్యూస్​ డెలివరీలో ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ టెక్నాలజీ వాడకాన్ని మరింతగా పెంచనున్నట్లు వే2న్యూస్​వెల్లడించింది. చిన్న పట్టణాలు, గ్రామాల న్యూస్​ను సైతం ఇచ్చే ప్రయత్నంలో సక్సెసయినట్లు వివరించింది. తమ మొబైల్​ ఫస్ట్​న్యూస్ ప్లాట్​ఫామ్​ భవిష్యత్​లో మరింతగా చొచ్చుకుపోయే అవకాశాలున్నాయని వే2న్యూస్​ సీఈఓ రాజు వనపాల చెప్పారు. వే2న్యూస్​ను పెద్ద వెర్నాకులర్​ ప్లాట్​ఫామ్​గా తీర్చిదిద్దాలనేదే తమ లక్ష్యమని వెల్లడించారు.