నిజాంపేట గోదాంలో షార్ట్ సర్క్యూట్

నిజాంపేట, వెలుగు : మండల కేంద్రంలో శివసాయి గన్నీ మర్చంట్ గోదాంలో శనివారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలు అదుపు చేశారు. కానీ అప్పటికే వ్యాపారి జిట్టి చంద్రశేఖర్ కు చెందిన ఫ్యాన్సీ ఐటమ్స్, చీరెలు కాలిపోయాయి.

సామగ్రి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని బాధితుడు  బోరున విలపిస్తూ చెప్పాడు. ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని కోరాడు. ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.