IND vs BAN: భారత్‌తో టెస్టు సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన

భారత పర్యటనకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB) తమ జట్టును ప్రకటించింది. నజ్ముల్ షాంటో నాయకత్వంలో 16 మంది సభ్యుల గల బలమైన జట్టును ఎంపిక చేసింది. లెఫ్టార్మ్ పేసర్ షోరిఫుల్ ఇస్లామ్ గాయం కారణంగా దూరమవ్వగా.. ఆల్ రౌండర్ జాకర్ అలీ సెలెక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు.

బంగ్లాదేశ్ ఇప్పటివరకు సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత్‌ను ఓడించింది లేదు, కానీ ఇప్పుడు మంచి ప్రదర్శన ఇవ్వగలమనే పట్టుదలతో ఉన్నారు. ఈ మధ్యనే పాకిస్థాన్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించి పూర్తి ఆత్మ విశ్వాసంతో కనిపిస్తున్నారు. సెప్టెంబరు 19 నుండి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుండగా..  అనంతరం అక్టోబర్ 06 నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ షురూ కానుంది.  

Also Read :- బుచ్చిబాబు టోర్నీ విజేత హైదరాబాద్‌

టెస్టు సిరీస్‌ షెడ్యూల్

  • తొలి టెస్టు: సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 23 వరకు (చెన్నై)
  • రెండో టెస్టు: సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు (కాన్పూర్)

టీ20 సిరీస్ షెడ్యూల్

  • తొలి టీ20: అక్టోబర్ 06 (గ్వాలియర్)
  • రెండో టీ20: అక్టోబర్ 09 (ఢిల్లీ)
  • మూడో టీ20: అక్టోబర్ 12 (హైదరాబాద్)

భారత టెస్టు సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), షద్మాన్ ఇస్లామ్, జకీర్ హసన్, మోమినల్ హక్, ముష్పికర్ రహీమ్, షకిబ్ అల్ హసన్, లిటన్ దాస్, మెహిదీ మిరాజ్, జకేర్ అలీ, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, నహిద్ రానా, తైజుల్ ఇస్లామ్, మహ్ముదుల్ హసన్ జాయ్, నయీమ్ హసన్, ఖలీద్ అహ్మద్.