వికారాబాద్: తెలంగాణలోని ఈ గ్రామంలో 80 శాతం మంది ప్రజలు దురద, గోకుడుతో బాధపడుతున్నారు. దాదాపు వారం రోజులుగా ఆ ఊరి జనాన్ని చర్మ సంబంధ సమస్యలు వెంటాడుతున్నాయి. ఎన్ని మందులు వాడినా దురద, గోకుడు తగ్గడం లేదని ఆ ఊరి జనం వాపోతున్నారు. వికారాబాద్ జిల్లాలోని ఒక ఊరి పరిస్థితి ఇది. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం బూర్గుపల్లి గ్రామంలో ఊరు ఊరంతా దురద, గోకుడు బాధలతో అవస్థ పడుతుంది.
చిన్నా, పెద్ద తేడా లేకుండా గ్రామంలో 80% మంది ప్రజలు దురదలతో అల్లాడిపోతున్నారు. డాక్టర్లు వచ్చినా, మందులు ఇచ్చినా చర్మ వ్యాధి తగ్గలేదు. ఎన్ని మందులు వాడినా దురద గోకుడు తగ్గడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఉన్నట్టుండి ఈ చర్మ సమస్య ఊరి జనాన్ని పీడించడం వెనుక ఉన్న కారణాలేంటో తెలియాల్సి ఉంది. కలుషిత నీరు తాగడం వల్లే ఆ ఊరికి ఈ సమస్య దాపురించిందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ALSO READ | చిట్టీలు కడుతుంటారా..? జర భద్రం.. రూ.2 కోట్లతో చేతులెత్తేసిన చిట్ ఫండ్ కంపెనీ..