సోషల్ మీడియాలో భార్య వీడియో.. వదిలేసిన భర్త

సోషల్ మీడియాలో భార్య వీడియో.. వదిలేసిన భర్త

యూపీ: 22యేళ్ల యువతిపై అత్యాచారం చేసి, ఆ ఘ‌ట‌న‌ను త‌న మొబైల్ లో చిత్రీక‌రించాడు ఓ దుర్మార్గుడు. ఆ త‌ర్వాత ఆమెకు పెళ్లైన విష‌యం తెలిసి ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో పెట్టాడు. ఇది తెలిసిన ఆ మ‌హిళ భ‌ర్త ఆమెను వ‌దిలేశాడు. యూపీలోని రేవ‌తి ప్రాంత‌లో ఈ దారుణం జ‌రిగింది. 2020, జనవరిలో న‌రేంద్ర అనే వ్య‌క్తి యువ‌తిపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఆమెకు పెళ్లి జ‌రిగింద‌ని తెల‌సుకొని ఆ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను డిసెంబ‌ర్ లో సోష‌ల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఆమె భర్త ఈ వీడియో చూడడం, విషయం సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ కావడంతో తో అతను వెంటనే ఆమెను వదిలిపెట్టేశాడు. దీంతో పుట్టింటికి చేరిన బాధితురాలు, ఈ నెల 5 న‌ తండ్రితో క‌లిసి స్థానిక పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసింది. దీనిమీద వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకొని, మంగ‌ళ‌వారం నాడు నిందితుడు నరేంద్రను అరెస్ట్ చేశారు.