హైదరాబాద్లోని మధురానగర్ బ్యాచిలర్ రూంలో ఆమె జీవితాన్ని ఆగం చేశారు..

మధురానగర్: హైదరాబాద్లోని మధురానగర్లో దారుణం జరిగింది. మహిళపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్కు పాల్పడిన ఘటన కలకలం రేపింది. హైటెక్ సిటీ క్రాస్ రోడ్లోని ఓ భవనంలో పని ముగించుకొని వస్తుండగా, బట్టలు ఉతికే పని ఉందని, మాయ మాటలు చెప్పి మహిళను యువకులు తీసుకెళ్లారు. గదిలో మహిళపై యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. మహిళా కేకలు విని పక్కింటి మహిళ అలర్ట్ అయింది.

సదరు మహిళ ఆ బ్యాచిలర్ రూమ్ తలుపు కొట్టడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడిన ముగ్గురు యువకులు అక్కడి నుంచి పారిపోయారు. మధురానగర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ముగ్గురు యువకుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఘటన స్థలానికి క్లూస్ టీం, మధురా నగర్ పోలీసులు చేరుకున్నారు.